పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/463

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయి బోల్తాపడుటయే - 2

467


ఈయంశము కొలఁదిమాసములనాఁడొక వ్యాసమున వ్రాసియున్నాను, చూడుఁడు. “తి. శా. గారు అవసాన కాలమునకు నాలుగేండ్లకు ముందు మంత్రశాస్త్రమున మిక్కిలిగాఁ బరిశ్రమచేసిరి." (అపవాదలు చూ.)

తేలినసారమేమన? శుచిముఖిపాత్రలో విమర్శకునిత్రోవ ననుసరించి మాయిరువురలో నెవరి ప్రతిఫలనముగూడ లగింపదు. అగుచో తి. శా. గారిదిమాత్రము సమంజసమని విమర్శకుఁడుగారు వ్రాయుట కర్థము లేదని తేలినది. ఈ ప్రభావతీప్రద్యుమ్న నాటకము నిటు లుంతముగాక. “భూదేవతాగారగోదావరీతీరకంకణగ్రామంబు కాపురంబు" కంకణగ్రామ మనఁగా? కడియ మనియే కదా! ఆగ్రామ మిరువురకును నివాస గ్రామమని చదువరులు విశ్వసింతురా? ఇది విమర్శకుఁడుగారి కెట్లు సమన్వయించినదో? కాదు. వేం. శా, గారికి మాత్రమే అనిసమన్వయించుకొనిరందురా? అగుచో, ఆసీసగీతిలోని "తగు నుపాస్యంబు కాళీపదంబు మాకు" అనునది బాధించునే? విమర్శకుని త్రోవనుబట్టి మా కవనమునఁ గుదురని వెన్నియో కలవు. వానినన్నిటిని జూపుచో గ్రంథము బళ్లను దోలవలయును కావున నిఁకనొకటిమాత్రముచూపి విమర్శింతును. “చ. తిరుపతివేంకటేశు లని ధీరులు పిల్లురు... ... ... ఈకవిత్వ మనఁగా? నది పిన్నటినాఁడెపుట్టె నబ్బురముగఁ బెంచికొంటిమి.” ఇయ్యది విజయనగరపుమహారాజావారి పద్యములలోనిది. పిన్ననాఁటి నుండి కవిత్వము చెప్పినదెవరు? "గోచివెట్టకమున్న కోమలకవిత చెప్పినవాఁడు సహపాఠి వేంకటకవి" (దేవీభాగవతము) 1 స్కం.) “ఉ. గోణము పెట్టుటాది బుధకోటి నుతింపఁ గవిత్వవైదుషీ వేణికయౌచుఁ బేర్పడిన వేంకటశాస్త్రికి"

(గీరత ప్రథమ భాగము)

తిరుపతిశాస్త్రిగారు వ్రాసిన పయిసందర్భమునుబట్టి బాల్యమందే కవిత్వము పుట్టుట వెం. శా. గారికని తేలినను తి. శా. గారికెప్పుడు కవిత్వమారంభమైనదనియుఁ దేలదు. (కాళీసహస్రమునుండి) “శ్లో. సాహిత్యాం గురుపాణి నీయజనితా, పౌరాణ సంవర్ధితా - దేశాలోకన పుష్పితాచ కవితాకన్యామయి ప్రత్యయాత్ - వవ్రేమాం స్వయమేవ"

పైశ్లోకార్ధము ప్రౌఢావివాహమును ధ్వనింపఁ జేయుచున్నది. ఇది తి. శా. గారి శ్లోకము. అతcడు బ్రహ్మయ్యశాస్త్రులవారి సన్నిధికి వచ్చునప్పటికి 17 వత్సరములు దాఁటినవి. పిమ్మట నొకటి రెండేండ్లకుఁగాని కవిత్వరచనకు తి. శా. దిగలేదు, కావున నట్లు వ్రాసికొనెను. పైశ్లోకములో “మయి" మామ్ అనునేకవచనములను గూడా గమనింపవలయును. విమర్శకుఁడుగారి ధోరణి కీయేకవచనములుగూడ ప్రస్తుతనాటకము నందలి ప్రతిఫలనమువలె నస్త, వ్యస్తములే కావలయును. అది యటులుంతము. తి. శా.