పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/460

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

464

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

పై వాక్యమువలన “విమర్శకబుధుఁడు" గారి కుతూహలము వెల్లడి యగుచున్నది గదా? ఈయనను తఱచుగా మీరు విమర్శకబుధుఁడనివ్రాయుచుంటిరే, కారణ మేమని చదువరు లడుగుదురేమో? ఆ బిరుద మాయన వాక్యములయందలిదే!

“శ్లో గుణదోషౌ. నియచ్ఛతి" అను విషయము విమర్శకాన్య బుధవిషయమని చెప్పవలయును.”

ఈయన కేవల బుధుఁడు కాక "విమర్శకబుధుఁ" డఁట! అక్కతమున “గుణమును గ్రహించుట మాని దోషమునే గ్రహించు" నఁట! అందులకై వెదకి వెదకి- "వెక్కిరింపఁబోయి బోల్తాపడెను" కాంబోలు! నాకు శీర్షికను వెదకికొను పరిశ్రమలేకుండఁ జేసిపెట్టినందులకీ 'విమర్శక బుధుఁడు' గారిని మిక్కిలి యభినందించుచు, నిప్పటికి దీనిని ముగింతును. ఇంకొకపరి “ప్రతిఫలన" మునుగూర్చి యోపిక తెచ్చుకొని కొండొకచో వ్రాయుదును. వ్రాయుట కేమిగాని యీ విమర్శక బుధుని లోలోనేని అన్న సూర్యనారాయణ శాస్త్రి మందలించుట యావశ్యకమని నా తలంపు. ఇది యుక్తమే యని తోఁచినచో నతఁడట్లొనరించుఁగాక లేదా, "కాదగ్గపని గంధర్వులే తీర్తురు!"


★ ★ ★