పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/459

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయిబోల్తాపడుటయే - 1

463


వ్యర్ధపుఁబని గల్పించి "చావల్‌ఖరాబు" సామెతను జ్ఞప్తికిఁ దెచ్చుట వలన మఱింత స్పష్టపడియుండును. ఇఁక ఈ “ఏకగోత్రజనిత" వివాహవిచారమువలననో? “సర్వం సంపన్నం. సుసంపన్నం" అయినదనుకోని వారుండరనుకొందును. ఈ వివాహసందర్భము ప్రథమాంకములోనిదే. ఇది నూటఁ దొంబది వంతులు పూర్తియగువఱకు తిరుపతిశాస్త్రిగారు జీవించియే యున్నారు. ఇది మనమందుఁ బెట్టికొని యీక్రింది గ్రంథమును దిలకింపుఁడు.

"తిరుపతిశాస్త్రిగా రొక్కరే సంపూర్ణముగ నీ నాటకమును రచించిన నిట్టి పూర్వోత్తరవిరోధము లుండకుండునో? లేక యింతకన్న నెక్కుడుగా నుండునో!"

“విమర్శకబుధుఁడు" గారి తాత్పర్యము కాదు గాని పైకిమాత్ర మీ వాక్యమున కర్థము, "అయ్యవారిని జేయఁబోయిన" అను సామెతకు స్ఫోరక మగుచున్నది కావున నిదిగూడ “బోల్తాపడు" అన్నదానితో జమకట్టుకొని, అతని తాత్పర్యమునుబట్టియే పైవాక్యమున కర్థము చెప్పికొందము. తానుతెల్విలోపముచే మానాటకమునఁజూపిన లోపములకుముఖ్యకారణము, వేంకటశాస్త్రులుగారి రచనముగూడ నిందుఁ జేరుటయే యన్నది "విమర్శక బుధుఁడు” గారి తాత్పర్యమైయున్నది. అగుచో, ప్రథమాంకస్థమగు “ఏకగోత్రజనిత వివాహము" వెం. శా. రచనకు సంబంధించినది కాదుగద! ఇది స్వవచో వ్యాఘాతమా కాదా? బ్రదుకంతయు స్వవచో వ్యాఘాతముగా నున్నప్పుడు - ఇది అని విడఁదీసి చూపరాదని ప్రాజ్ఞులందరు కాఁబోలును! అగుచో, నీక్రిందిమాటలు వ్రాసి ముగింతునుగాక. బాగుగ నాలోచించినచో నీనాటకము రచించుటకు, తి. శా. గారును అర్హులు గారు, వేం. శా. గా రంతకుమున్నే కారుగదా! ఈ కథానాయిక ప్రభావతిగాని, నాయకుఁడు ప్రద్యుమ్నుఁడు గాని, లేక యిరువురుంగాని యేకొంచెమైనను అదృష్టవంతులే యైనచో నెన్నఁటికేని యిద్దాని రచనకు మావోలేటి వెంకటసుబ్బరాయశాస్త్రులవారే పూనుకోవలయునను కొందును. అది యుటులుండె. సంశయమున్నచో, విమర్శక బుధుఁడుగారు వ్రాసినచొప్పున - "జీవితః కవేః ప్రష్టవ్యమ్" కనుక జీవించియున్న నాకొక కార్డు వ్రాసి కనుఁగోవచ్చునే! లేదా తనకన్నఁ గొన్ని రెట్లధికుఁడు తారతమ్యజ్ఞానశాలి, మాయింటి యల్లుఁడు, విశేషించి తనకన్నయునైన సూర్యనారాయణశాస్త్రి నడుగవచ్చునే! లేదా? అతనిద్వారమున నాకుకబురుచేసి తెలిసికోవచ్చునే! పత్రికలో వ్రాసియే కనుఁగోవలెనోటు? కావున నీ ప్రయత్నము సర్వథా యశస్సంపాదనార్థ మనుకోకతప్పదు. దానికిని మంచిమార్గము లనేకము లున్నవి. ఈయన వాని నన్నింటిని విడచి యీముళ్లకంచెలోఁ బడినాఁడు. పాపము! గ్రంథకర్తచే క్షమాపణ చెప్పించి సంతోషింపవలయునని యీయన కుతూహలము చూడుఁడు.

“పరిశీలించి సవరింప నక్కఱలేదనిన సంతసము”