పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/457

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయిబోల్తాపడుటయే - 1

461


దువ్వవచ్చునా అనియు సంశయింతును. కాని సుబ్బరాయ శాస్త్రులవారేమంత తారతమ్యమును గమనించిరి నే గమనించుట”కని యితఁడనుకొని యుండునని సమాధానము చెప్పికొంటిని. అయినను ప్రశిష్యుని మందలించెదను. “అబ్బాయీ! సుబ్బారాయశాస్త్రుల వారుపాధ్యాయులు. నీ వింకను విద్యార్థివి. వయస్సులోఁగూడ నీకన్నవారు చాల పెద్దలు, తెల్వితేటలు దైవాధీనములు గదా! మనకు వయస్సే ప్రధానము. వారు వారి తప్పును గ్రహించి క్షమాపణ చెప్పికొన్నను చెప్పికొనకున్నను నీవు వారిపై కాలు దువ్వినందులకు క్షమాపణ చెప్పుట యుక్తమనుకొందును. కావున నటులొనర్తువుగాక"

చదువరులారా! ఇదివఱలో దీనిని గుఱించి నేను వ్రాయునప్పటికన్న నిపుడు కొంచె మెక్కుడు దేహారోగ్యము కల్గియున్నాను. లోకులు నా వ్రాయుట కంగీకరింపకున్నను “విమర్శకబుధుఁడు" గారి యింకొక వాక్యమును రంగమున కవతరింపఁజేసి రెండు పంక్తులు వ్రాసి విరమింతును. క్షమింపుఁడు-

"వరుఁడు నళినాసన వాహన హంసములలో నొకఁడు, వధువు నళినాసక రథవాహన హంస పతివంశ సంభవ. అట్లయినచో, నేకగోత్రజనితులకు వివాహ మంగీకరింప వలయునా?”

చూచితిరా? విమర్శకబుధుఁడు గారి ధర్మశాస్త్ర పరిశీలనము. హంసములకు వివాహమొనరించు పట్టునఁగూడ-

"చాతుర్థీం" అనుశ్లోకార్ధమునేకాక "కూటస్థగణనాయాం తు స్వసారం మాతరం వినా, ఊనద్వాదశవార్షికీం” లోనగు శ్లోక తాత్పర్యములనుగూడ విచారించి కాని చేయఁగూడ దన్నంతలో నున్నది. ఒకటి మనమాలోచించుకోవలెనేమో? సర్వసామాన్యమైన పక్షులవిషయమే యగుచో “విమర్శకబుధుఁడు"గా రింత విచారింపరు. ఈ పక్షులకు మనుష్యభాషణాదులే కాక చాల విద్యలు వచ్చినట్లున్నది కావున వీని వివాహ విషయము మనుష్యులతోపాటుకూడా కాక అంతో యింతో బ్రహ్మసంబంధముకూడ నుంటచే బ్రాహ్మణులతోపాటు చేయింపవలెనని వారి తాత్పర్యమేమో? మహత్కార్యములగు సంభాషణాదులు వీనియం దుండుటచేతనే మహద్వివక్షచేసి “ఏకగోత్రజనితులు" అని ప్రయోగించియున్నారనుకొందమా? ఆ యీ సందర్భములనుబట్టి యా వివాహమునకు పంచకరహితమైన లగ్నముకూడ బలవత్తరమైనది యున్నంగాని విమర్శకుఁడుగా రొప్పరు కాఁబోలును! ఇంతేకాక రజస్వలా వివాహమునకుఁగూడ వొప్పరనుకోవలెను. పక్షుల విషయమున రజోదర్శన వయోనిర్ణయము వగయిరా లీయనకు తెలిసియే యుండు ననుకోవలెను. మఱచితి నింకొక పెద్దచిక్కున్నదిగదా! "శారదా" బిల్లుబాధ కూడ గమనింపక