పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

460



వెక్కిరింపఁబోయిబోల్తాపడుటయే-1

దీనిని గూర్చి డిసెంబరు భారతి సంచికలో సంగ్రహముగ నే వ్రాసిన వ్యాసమును చదివిన నా శిష్యులు పలువురు నన్నుఁగూర్చి “ఈవయస్సులో, ఈ అనారోగ్యస్థితిలో మీకేల యీ పరిశ్రమము? అదిగాక మీరు సమాధానము వ్రాయఁదగిన యంశము లందేమియున్నవి? ఏమేని యున్నచో వ్రాయుటకు మే మెందఱమున్నారము కాము" అనుచు నన్ను మందలించుచు నుత్తరములు వ్రాయుచున్నారు. కొందఱు తమ తమ నేర్పుకొలఁదియు ఖండనములు వ్రాసి నాకడకంపియున్నారు. అందొక ప్రశిష్యుని ఖండనము నందలి పద్యములలోని యొక పద్య మిట నుదాహరించుచున్నాఁడను

ఉ. “చాలును జాలు నీ వెఱుక చాలక దూఁకితి చింతనిప్పులో
    లోలత, దోమయుంబలె విలోలుఁడ వైతివి, దారితప్పి, తో
    యోలెటివార్థి శీతకర! ఓపుదె? యోర్వఁగ వేంకటేశ్వరున్
    మాలిమి వీడి వేఁడుము క్షమాపణ, వారిని వారి శిష్యులన్",

ఇతఁడు ప్రశిష్యుఁ డెట్లయ్యెనో యీ క్రింది యితని వాక్యముల వలన నవగత మయ్యెడిని.

“అయ్యా! నేను మీ శిష్యులగు మల్లికార్జున శాస్త్రులవారి తృతీయ పుత్రుఁడను. చిట్టిగూడూరి పాఠశాలలో విద్వాన్ 2 వ క్లాసు చదువుచున్నాను. మీ పొత్తముపైవ్రాసిన విమర్శనకు నాకుఁదోఁచిన భంగిఁ బైరీతినుత్తరం బిచ్చితి..." (చేవ్రాలు)

ఈ ప్రశిష్యుని పేరు, వీరేశ్వరశర్మ ఇంటిపేరు మల్లంపల్లెవారు. ఇతఁడు చాల పూపప్రాయము వాఁడనుకొందును. ఈతని తండ్రి మంచి విద్వత్కవి. కొమరులందఱును విద్వాంసులై పయికి వచ్చినారు. తండ్రిగారి యదృష్ట మభినందనీయము. ఈ ప్రశిష్యుని జూచిన జ్ఞాపకము లేదుగాని యితని యన్నలం జూచినట్లు జ్ఞప్తియున్నది. వారల విద్యకన్నను వినయము మిగుల నభినందనీయము. “విద్యవలనను వినయంబు" అను నభియుక్తోక్తికి నిజమైన యుదాహరణ మాబాలురే! ఇతఁడుగూడ నట్టి వినయము గలవాఁడే అని నా యూహ. అగుచో మన “విమర్శకబుధులు" శ్రీ సుబ్బారాయశాస్త్రులవారిపై నిట్లు కాలు