పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆశుధారలోకూడా యేవకటిరెండో తప్ప దొరకకూడదు. పోనిండు యతిమాట కేమి? ఆయతులనుకూడా యెక్కడో బుద్ధిపూర్వకంగా కాకపోయినా ప్రమాదంవల్లనేనా తి. వేం. కవులువాడేవున్నారనుకుందాం. దిద్దుఁబాటు హృదయంగమమేనా? అని నేను సహృదయులనడుగుచున్నాను. ఆచార్లగారినికాదు. వీరిపోకడ కింకొకటి చూపి ముగిస్తాను. యీ ఘట్టంలోనే ‘ఉ. కామముచేతఁగాని భయకంపితచిత్తము చేతఁగాని అనే పద్యాన్ని యెత్తుకొని- 'భయముచేతఁగాని' అంటే బాగా అతుకుతుందని సవరణ నుపపాదించినారు. పద్యమన్న సంగతి మఱిచారేమో? అంటే, మఱిచినట్లున్ను లేదు. కాదనడానికి 'శా. కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు' అనే పద్యాన్ని వుదాహరించారు మళ్లాను వారితల్లికడుపుచల్లఁగాను. దానివల్ల మనకేంలాభమంటే, భయమునన్ అన్నట్టే కామమునన్ అంటే బాగా అతుకుతుందని స్వామి కెందుకు తోcచిందికాదో! అనేవాళ్లకు అవకాశం కలిగింది కదా! యీలాటి వుపకారాలు చాలావున్నాయి స్వామివారు చేసినవి, యేదో సరీదర్భం కలిపించుకొని తెనాలిరామలింగకవిగారి

“చ. తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్ములన్”

అనే పద్యాన్ని కూడా వుదాహరించారు. యిది వెనక దొంగ పాఱిపోతూవుంటే కాళ్లట్టుకు వ్రేళ్లాడుచున్న గేస్తురాల్ని మగఁడు, "వొసేయివాఁడు వేళ్లు కొఱుకుతాండే" అన్నకథను జ్ఞప్తికిఁ దెస్తూవుంది. దీనికేంగాని స్వామి యీ పుస్తకం రచించడంలో చేసినలోపాలెన్నో వున్నాయి. అవన్నీ చూపడానికి నాకు వోపికలేదు. వయోమాత్రవృద్దుణ్ణి గదా! లక్షణ భంగాలంటే ఛందోవ్యాకరణభంగాలకంటూ అనవసరంగా వారివీ వీరివీ వుదాహరించారుగాని స్వామి వుదాహరించకుండానే వారిస్వంతకవిత్వంతోనే అవి యెత్తుకుపోయేవి. శుద్ధపత్రికలో శ్రద్ధగా దిద్దినప్పటికీ, అజ్ఞానప్రయుక్తదోషా లింకనూ శరపరంపరగా వున్నాయి. వ్యావహారికభాష అనుకుందామా? స్వామివారి వ్రాఁత అదిన్నీకాదు, గ్రాంథిక భాషందామా అదిన్నీకాదు, స్వాములారిభార్యలాఉంది. దీన్ని ఋజువుచేయమనిస్వామివారి ఆజ్ఞయితే చేస్తాను. యిట్టి పుస్తకాన్ని యేదో పరీక్షకు పఠనీయంగా యేర్పఱచిన యూనివర్సిటీబోర్డు వారు బుద్ధిపూర్వకంగా కాకపోయినావిధిలేక వ్యావహారికభాషను సమ్మతించినట్లయింది. కనుక ఆ పక్షంవారికి వంద్యులనుకోకతప్పదు. స్వామివారి విమర్శనాధోరణి మా అపూర్వకవితా వివేచనంలో చాలాకాలంనాఁడే చూపఁబడింది. యిప్పుడు, మళ్లా చూపనక్కఱలేదు. “కంటికి నిద్రవచ్చునె? సుఖం బగునే? రతికేళి జిహ్వకున్” అనే శ్రీనాథునిపద్యాన్ని విమర్శించమంటే? స్వామి మొదట షష్ట్యంతంతో అన్వయం ఉంది కనక రెండోవాక్యములోకూడ షష్ఠ్యంతంతో అన్వయంవుంటేనేకాని