పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

456

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“ఆ వ్రాతనుగూర్చికూడ, ఈసందర్భములో ఒక కారుణ్యము వేయుట మంచిదనుకొందును" అందుచేత “బొక్క" కి “తొక్క" లాగే యిదిన్నీ సరిపోతుంది. “జ్ఞానలవదుర్విదగ్ధత్వం” వగయిరాలు వారిరచనవల్లనేమి వారు తిరిగే ఆక్షేపించిన "ప్రకాస్తి-అభణ" వగయిరాలవల్ల నేమి సుళువుగా సమర్ధింపఁబడతాయి. యిఁక ఆచార్లగారు "వయోమాత్రవృద్ధత్వా"న్నేని గణించక చేసిన తూలుప్రసంగం మిగిలిపోతుంది. స్వామివారి గ్రంథంలో వున్న యితరతప్పులువుపేక్షించి గ్రామ్యదోషానికి వారిసిద్ధాంత ప్రకారం బాధించేవి దిఙ్మాత్రముదాహరిస్తాను.

(1) పంచమాధికరణము, (2) లింగము, (3) కావున నాతీరుగల, (4) మదింగా, (5) కమలము, (6) కాటయవేమన, (7) ఈనర్హుఁడవగుదని, (8) నెచ్చెలికాడు, (9) సహజన్యచూడనొప్పెఁ జారుదోహదల క్షణసహితి, (10) తియ్యఁబోడి, (11) రామలింగకవి, (12) కూర్పు కూర్చెదన్, (13) భగదత్తు, (14) అప్సరోమయము, (15) అతిమాత్ర, (16) బిరుదోత్సవములకు, (17) సంకటముల, (18) దహన, (19) వెండిగుండన, (20) మేళగింపుకాలేదు, (21) మొత్తపుకూర్పు, (22) ఎఱుఁగుటచే, (23) భీముఁడను -శుంభత్కుంభి, (24) కెంపుకడాని, (25) ముగుద, (26) మానము, (27) లక్ష్యముండవలయు, (28) ముట్టంగ. -

యింకను ఆచార్లవారి పొత్తమునుండి యిట్టివెన్నో చూపవచ్చు. వీటిలో కొన్నిటికి అసకృదావృత్తికలదు. వారి విమర్శనాధోరణి ననుసరించినచో యీచూపినచోట్ల అంతోయింతో గ్రామ్యదోషమును చూపవచ్చును. యీ చూపినవాట్లలో వారు వుదాహరణంగా చూపిన మహాకవులకవనంలోవి కొన్ని కొన్ని వారివివరణవాక్యాలలోవి. మా మతములో నివియన్నీ నిర్దుష్టములే. వారిమాట వారికివప్పగించేపక్షాన్ని యివిఅన్నీ దోషదూషితములే. యేది యెందుకు దోషదూషితమయిందని స్వామి బహుశః ప్రశ్నింప రనుకొంటాను. ప్రశ్నిస్తే విపులంగా వివరణం వ్రాస్తాను. యిప్పుడెందుకూ వృథాపరిశ్రమ? మఱిన్నీ వీరికి తెలుఁగువ్యాకరణ సంధులు తెలియవనుటకు చాలా వుదాహరణాలు దొరుకుతాయి. చూడండి యీవాక్యాన్ని "సౌభాగ్యము నొదవెడలంకారైక దేశములు". నావుడు, అనవుడు, యేమవుతారంటూ యెగతాళిచేయడం కలదు. వీరికి ఒదవెడున్ అను తద్ధర్మ విశేషణం రాముఁడువంటిదై సంధిని సంపాదించుకుంది. పయిగా సాహస మెంతో వున్నట్టు- అయితే, యోచించి యివి "సిద్ధిర్లోకాద్దృశ్యా" వల్ల సాధువులవుతాయని వ్రాయడంవల్ల కనపడుతుంది, పైసంధికూడా, యీ 'దృశ్యా'లోకే చేరుతుం దనుకుంటాను. యిట్టివి చూపవలసివస్తే మిక్కిలి పెరుఁగుతుంది వ్రాఁత. వారిమాట వారికి వప్పచెప్పడమే