పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

455


వారికి? జాతకరీత్యా యింకా ఆయువుంది. రెండోపక్షంలో సమర్థులైన శిష్యప్రశిష్యులున్నారు. స్వామివారిని నిరోధించి అడుగుతారు. యేమని? మీ ప్రవృత్తినిబట్టి వాడఁదగ్గమాటలే గురువుగారు వాడినారు. 'అవసరపఠితా వాణీగుణగణరహితాపి శోభతే పుంసామ్' అని అవసరానికి తగ్గమాటలు వాడవలసివచ్చింది, వాడినాను. ఔచిత్య విచారచర్చ చేసిచూస్తే స్వామికి కోపం రాకపోయేదే, కాని నా ప్రకృతిలో అలా సహించేగుణం కాదు. "దుస్త్యజాహిప్రకృతిః" అని వారే వ్రాశారు. పత్రికవారు విసుక్కోకపోతే నా ప్రకృతిని స్వామివారు రుచిచూస్తారు. స్పృశించి విడిచానేకాని ప్రధానాంశం యింకా మొదలెట్టలేదు. "అభణ" నిరర్థకమన్నది స్వామి మఱుస్తారేమో? జ్ఞాపకంచేస్తే మంచిదిగదా! ప్రత్యుత్తరానికి నిరీక్షించే వేం. శా. శతావధాని.

అనుబంధం

(1) ఆచార్లగారు తాము నిరపరాధులైనట్టు వక వాక్యం వుటంకించారు. ఆవాక్యమిది. "నేను మీ గ్రంథమును విమర్శించునప్పుడు నాయాంధ్ర కావ్యాలంకారసూత్రవృత్తి వివరణమునం దొక్క పరుషవాక్యమేని మీవిషయమై వాడినట్లు చూపఁగలరా?"

పరుషవాక్యాన్ని పిమ్మట చూపుదాం. ముందుగీటుంచినచోట మాకు ఆయన ఆపాదించిన “బొక్క" వంటి “తొక్క" కనపడుతూవుందా? లోకంలో “తొక్క" పదం బూతులాటలో గ్రామ్యులు వాడేదేనా? “తొక్కన్న తోలన్న" ఇత్యాదులు స్వాములున్నూ వినేఉంటారు. కాఁబట్టి విస్తరించేదిలేదు. వారిసిద్ధాంతప్రకారం యిది గ్రామ్యదోషంకదా! పిమ్మట యింకా యిట్టివి మఱికొన్ని చూపుతాను. ప్రస్తుతం యిది "వెక్కిరింపబోయి బోల్తాపడడం” కిందకు డేఁకుతుందిగదా! యిఁక పరుషవాక్యం చూపుతాను.

ఈచివర సమాసము... బ్రాహ్మణ పరిషత్తులో చండాలునివలె నున్నది మాకవిత్వమును తెలిసో తెలియకో తోచినరీతిని విమర్శిస్తూ లేదనితోస్తే బాగులేదనడం యుక్తంగాని యీ "చండాల" పదప్రసంగమెందుకు? దీనింబట్టి వీరికిన్నీ మాకున్నూ యేవిధమైన ముఖపరిచయము కూడ లేకున్నను, యేదోవైరకారణ ముండితీరవలెను. మఱియే యితర లక్షణగ్రంథకర్తగానియీ "చండాల" పద ప్రసంగముతో కవి కవిత్వాన్ని యీసడించినట్లు స్వాములు చూపఁగలరా? అయితే యిందు వ్యక్తిదూషణ లేదంటూ సమాధానం చెప్పవస్తారేమో? నేను “కారుణ్యం" వేసింది మాత్రం వ్యక్తికా, వ్రాఁతకా? చూడండి-