పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/447

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

451


ఆచార్లుగారు “అయితే, యోచించి, సాధువనడాన్ని కూర్చియేమి? వాట్లను ఆక్షేపించే విషయానికి “ప్రకాస్తి, అభణపు గాండ్లు, ఢిల్లికి ఢిల్లే పల్లెకు బల్లే" అనేవి అడ్డతగులుతా యన్నవ్రాఁతకేమి? పిమ్మట వ్రాస్తాను. కాని ఆ ప్రయోగాల యందున్న తప్పిదమును మాత్రం స్వామివారు ముందుగా విపులంగా వ్యాఖ్యానం చేయాలనుకుంటాను. యేదో టిప్పణి కొంచెం వ్రాశారు, అదిచాలదు. విపులంగా తత్తన్నిష్ఠమైన దోషస్వరూపాన్ని వ్యాఖ్యానం చేయాలిగాని "నీళ్లలో గేదెను బెట్టి బేరం" చెప్పఁగూడదు. కాఁబట్టి మిక్కిలి అవసరమైన యీ విషయాన్ని స్వామిగారు గమనించాలి. అక్కడక్కడ “ఓనమాల కుఱ్ఱాఁడికి బోధించినట్టు బోధిస్తూ వచ్చారే? యిక్కడ మాత్రం “గురోస్తు మానం వ్యాఖ్యానం"గా వ్రాస్తే యెలాగ? యీ వయస్సులో అయాచితంగా నాకిలాటి గురువులు దొరకడం పురాకృత పుణ్య పరిపాకంగదా! "గుణాః పూజాస్థానమ్” అది అట్లుండె, లక్షణ గ్రంథముల కఠిన నియమములకు నేను వప్పుకొంటూ లక్ష్యానికి అనగా లాకలూకాయలడానికి కాదు, మహాకవుల లక్ష్యానికి యెక్కువ ప్రాముఖ్యం యిచ్చితీరాలి అనికదా వ్రాశాను? దాన్ని గుఱించి యేదోవ్రాస్తూ తిట్లకి రేఁగారు స్వాములు. అవి యాచిత్యానికి దూరంగా వున్నాయి. వారికి జ్ఞానలవదుర్విదగ్ధత్వమే తిట్టుగా కనపడ్డది. “సర్వజ్ఞత్వము సాంబమూర్తిది" గదా! అయితే సర్వజ్ఞులే అనుకుందాం స్వాములను. “అభణ" అర్థంకాక పోవడమేమిటి? “ఢిల్లికి ఢిల్లే" దోషజుష్ట మవడ మేమిటి? నేను వ్రాసిన జ్ఞానలవదుర్విదగ్ధత్వాన్ని సమర్ధిస్తేనే ఆచార్లగారు సమ్మతించవచ్చును. లేదా, బలవంతం లేదు. అన్నిటికిన్నీ మకుటం నిరుష్ట హృదయంతో తమ గ్రంథంలో మా ప్రయోగాన్ని యెత్తుకున్నారా? దుష్ట హృదయంతో యెత్తుకున్నారా అన్నది. యిది స్థిరపడితేనేగాని తక్కిన చర్చకు దిగడం అవసరంకాదు. యింకొకటి లక్షణ గ్రంథాల్లో వుదాహరణా లిచ్చేటప్పుడు సమకాలికుల పుస్తకాలనుండి యివ్వడం అంత గౌరవప్రదంకాదు. గుణాలకున్నూ దోషాలకున్నూ కూడా ప్రాచీనులవి యివ్వడమే యెక్కువవీలు. వాళ్లు స్వర్గస్థు లవడంచేత లక్షణ గ్రంథకర్త తెల్వితక్కువగా ప్రవర్తించినప్పటికీ తిరగబడి అడగడం తటస్థింపదు, అదిగ్రంథకర్తకెక్కువ సుఖంగదా? ప్రతిప్రాచీన గ్రంథకర్తనున్నూ ప్రతినవీన గ్రంథకర్తా కొద్దోగొప్పో ఆక్షేపిస్తూనేవుంటాఁడు. అడిగేదిక్కు మాత్రం వుండదు. మళ్లాయెవరో బయలుదేరి పూర్వగ్రంథాన్ని సమర్ధించడమున్నూ వుందిగాని అది మిక్కలి అరుదు. వక్తవ్యాంశం. సమకాలికుల ప్రయోగాలు పుచ్చుకోవడంలో కూడా స్వాములవారేదో గొప్పను సంపాదించుకోవడానికే అన్నది. యిదే నిశ్చయమైతే తమరు బెత్తంచేతపుచ్చుకొని ఓనమాలు బోధించడానికి తగ్గస్థితిలో వున్న మావంటివారి గ్రంథాలనుండి వుదాహరణలు పుచ్చుకోవడం గ్రంథానికి వుపకరింపదనుట నిక్కం. యింకెందుకు పనికి వస్తుందంటే, యేదో క్రౌర్యంతో