పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/434

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

438

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సరేసరి. ఆలా చేసుకోకపోయినట్లయితే ఆ అరిష్టకారక గ్రహాలు తనమీదకొచ్చి, తన్నేమోబాధిస్తాయంటూ చెప్పగా నేను స్వయంగా విని ఆయన్ని చేదస్తబ్రాహ్మడనుకున్నాను. అట్లే నేను వ్రాసిన ప్రస్తుతపు వ్రాతనుబట్టి నన్ను కూడా కొందఱు చదువరులనుకుంటారేమో? అనుకున్నాసరే, నా అనుభవాన్ని నేను వ్రాశాను.

కవికిన్నీ విమర్శకుఁడికిన్నీ వుండే భేదాన్ని నాకు తెలిసినంతలో నిరూపించాను. యెంత వ్రాసినా యింతే. కవికి కవిత్వంసహజం కనుక లోకులేమనుకొన్నా యేదో గిలకడం వానికి తప్పనిసరి. విమర్శకుఁడికో, పనిలేనిపాటుగా కల్పించుకొనేపని గనుక సహజమైన ఆవేశంలోకి చేరదు. అందుచేత వాణ్ణి క్షమించనట్లు వీణ్ణి క్షమించకూడదన్నది ముఖ్యాంశం.


★ ★ ★