పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/430

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

434



కవికన్న విమర్శకుఁడికి జాగరూకత ఎక్కువగా ఉండాలి

కవి, విమర్శకుఁడు - యీ యిద్దఱికి చాలా సంబంధం అనాదిగా వస్తూవుంది. ఇప్పటిరోజుల్లో పడమటిగాలి తగలడంవల్ల యీ సంబంధం మఱీ కనఁబడుతూవుంది. విమర్శకుఁడికీ, వ్యాఖ్యాతకీ అట్టేభేదం కనపడదుగాని యిటీవల పడమటిగాలి సోఁకేక మాత్రం విశేషభేదం కనపడుతూనే వుంది. వ్యాఖ్యాత శాయశక్తులా తంటాలుపడి కవిని సమర్ధించడం ఆచారం. పూర్వకాలపు విమర్శకులుకూడా యించుమించు ఆలాగే వుండేవారు. అయితే యేదేనా వ్యక్తిగతమైన దురుద్దేశం వుండి విమర్శించేటప్పుడు మాత్రం పైరీతికి కొంత వ్యతిరేకంగా ప్రవర్తించడం వుండేది. దీని కుదాహరణంగా పండితరాయలు అప్పయ్య దీక్షితులవారి గ్రంథాలనీ, భట్టోజీ దీక్షితుల గ్రంథాలనీ విమర్శించిన ఫక్కీని చూపవచ్చును.

యిప్పటి విమర్శకులలో ప్రాజ్ఞులైన వారివిధానంచూస్తే వ్యక్తిగతంగా దూషణ లేశమున్నూ కనపడదుగాని అసలు కవియుద్దేశాన్ని కనిపెట్టకుండా తోచినట్లల్లా విమర్శించి మహాకవుల పోకడల్ని యీసడించడం విస్తారంగా కనపడుతుంది. యిందులకు కళాపూర్ణోదయపు విమర్శనం వగయిరా లుదాహరణం. కళాపూర్ణోదయంకవి నేటివాడుకాడు కాబట్టి విమర్శకునకున్నూ, ఆయనకున్నూ వ్యక్తిగతమైన మైత్రినిగాని, ద్వేషాన్నిగాని ఆరోపించడానికి లేశమున్నూ అవకాశంవుండదు. కేవలం కవితా నిష్ఠమైన గుణాలూ, అవగుణాలుమాత్రమే యీ విమర్శకులకు ఆధారం. అయితే వెనుకటి విమర్శకులకేమి, వ్యాఖ్యాతలకేమి, చట్టన పూర్వమహాకవులను కాదనడానికి సాహసంవుండేదికాదు. యిప్పటివారికట్లాకాదు. యెంతటి మహాకవినైనా సరే తోటకూరలో పురుగులాగా తీసిపాఱేయడానికి సాహసం కలిగి వుంటూవుంది. యిది యుక్తమైనా, అయుక్తమైనా యిప్పటివారిలో బాగా వ్యాపించిఉన్నవిశేషం.

యిఁక అధునాతనుల కవిత్వాన్ని అధునాతనులు విమర్శించవలసి వస్తే వారికీ, వారికీ యేదో వ్యక్తిగతమైన విరోధం వున్నదన్నమాటే. చూడండీ పాపము. యెంత అన్యాయమోను! వకాయన వకరి ప్రేరేపణ మీద వక పెద్ద మహాపండితుణ్ణి విమర్శిస్తూ,