పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

47


ఇప్పటి విద్య ప్రస్తుతం రష్యాలో జరుగుచున్న సామ్యవాదంలోకి డేఁకుతుంది. అంతో యింతో విద్య వచ్చినవారు యిప్పడు వేలకొలందిగా ఉన్నమాట సత్యం. అప్పటి విద్వాంసులవంటి వాళ్లు మాత్రం లేరు. చూడండీ యిప్పటివారి పాండిత్యాలేలావున్నాయోను.

వకచోట, “మహస్తరణులు” అని పడడానికి బదులు “మహాస్తరణులు" అని అచ్చులో దీర్ఘంపడింది. దాన్ని సవరించుకోవడం చేతకాక వకరు “గొప్పదైన ఆసనము కలవారు" అని అర్థం వ్రాసియున్నారు. యీ అర్థంలో లేశమున్నూ యోగ్యతలేదు. “మహః=తేజస్సుచేత, తరణులు-సూర్యులు" అని కవి తాత్పర్యం. యీ తాత్పర్యాన్ని గ్రహించగలిగినవారే అయితే ఆ హకారంమీదవున్న పొల్లు ముద్రాప్రమాదమని గ్రహించగలుగుతారు. గాని ఆ మాత్రం పిండిలేనివారికి అది సాధ్యంకాదని వ్రాయనక్కఱలేదు. యింకొకచోట

"తనయుల సనయుల మనుమల ఘనముల మునిమనుమల సైతము" అనివుండగా"మనుమలన్" అనునది మహద్వాచకముగాన, దానికి "ఘనములన్" అనే అమహత్తును విశేషణం చేయకూడదంటూ వకరు వెక్కిరిస్తారు. యీ కాలపు పాండిత్యాలు యిలా వున్నాయి, “ఘనము-ఘనములు" అనుకోకపోతే, ఘనా-మా-లక్ష్మీః - యేషాంతే ఘనమాః. ఆఘనమశబ్దానికి ప్రథమైక వచనం ఘనముండు, బహువచనం ఘనములు, రాముండు రాములు అన్నట్లే అగుననిన్నీ దాని ద్వితీయైకవచన బహువచనాలు “ఘనమునిన్" “ఘనములన్” అవుతుందనిన్నీ తెలిసి కోఁజాలని వారిప్పుడు కవులు కవులే కారు, ఇంకా యెవరో యెవరో యెవరో, ఆకాశంమీంద వుండేవారు. దీన్నిబట్టి అప్పటిపాండిత్యాలకూ యిప్పటి పాండిత్యాలకున్నూ కల భేదం వ్యక్తంగావడంలేదా? యింకొకటి మచ్చుకి చూపి వ్యాసాన్ని ముగిస్తాను.

"ఆత్మ ప్రభుతన్ సాగింపంగాcజొచ్చెన్"

అనివున్నది వకచోట. “ఆత్మప్రభుతన్ అన్నది సిద్ధసమాసమనుకొని “ఆత్మ అన్నది గురువుగావడానికి బదులు లఘువయిందంటోవకరు లిఖిస్తారు. యేమనుకొనేది? రేఫయుక్తమైనద్విత్వం పరమందుంటే పూర్వం వికల్పంగా లఘువవడానికి ప్రీవీకౌన్సిలుతీర్పు లున్నాయి. అవి అన్యత్ర విస్తరించడమయింది. యిక్కడ ఆత్మ-తత్సమం, ప్రభుతతత్సమం, ఈ రెండిటికిన్నీ సాధ్యసమాసం చేసుకుంటే నచశంకా నచోత్తరంగదా? హరి ప్రభుత్వంఅంటే అది సిద్ధమున్నూ కావచ్చును, సాధ్యమున్నూ కావచ్చును. యీమాత్రంకూడా తెలియనివారిప్పడు కవులు, మహాకవులు, చక్రవర్తులు, ಮಿಟ್ಟುಲು, వ్యాఖ్యాతలు. - పాండిత్యానికి దుర్దశపట్టింది. అందుచేతనే నేను తుట్టతుదకు వ్యావహారికభాషలోకి దిగింది. దీనిలో వ్రాస్తే తప్పనే వారుండరుకదా? సలక్షణమైనభాషలో వ్రాసినప్పటికీ దాన్ని