పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱొక అపవాద

427


పాకం లేనేలేదు అనేవాణ్ణి. నేను స్కూలులో వున్నాననే సంగతి మఱచిపోయి స్వేచ్ఛగా కంఠంవిప్పి చదివేవాణ్ణికూడాను. యిట్టిస్థితిలో మొల్లవిషయంలో వెం. శా. దురభిప్రాయం కలవాఁడనే అపవాదు గ్రహచారవశంకాక యెట్టిదనుకోవాలి?

ఈ గ్రహచారాన్ని నేను మిక్కిలిగా నమ్మడంవల్ల యితరులకంటె ఆ యీగ్రహాలు నామీద యెక్కువ అధికారాన్ని చూపి చెలాయిస్తున్నట్టు నాకు తోస్తూవుంది. దేవుఁడుగాని, గ్రహాలుగాని నమ్మితేనేగాని యేమీ చేయలేవంటారు పెద్దలు. త్యాగరాయలువారేమన్నారు, “కద్దన్నవారికి కద్దు, కద్దని మొఱలిడిన, పెద్దలబుద్దులు, నేఁడబద్ధ మగునె" అన్నారు. యీలాటి సందర్భంలో గ్రహాలు నన్ను లోఁకువచేశాయంటే చేయవు? చేయుఁగాక, నేను నమ్ముతూనే వుంటాను. నమ్మి నామీఁదవచ్చిన "అపవాద"ను, మిథ్యాపవాదనుగా ఆగ్రహస్థితినిబట్టే సమర్థించాను గనుక నా నమ్మకం కూడా నాకు వుపకారమే అయిందని సంతోషిస్తూ దీన్ని ముగిస్తాను. ముగిస్తూ నేనేపద్యాలు మొల్లరామాయణంలో పాఠం చెప్పేటప్పుడు మొల్లకు సీతతో ఐక్యంచెప్పేవాణ్ణో ఆపద్యాలు మాత్రం వుదాహరిస్తాను.

క. పతిదైవముగా నెప్పుడు
   మతిఁదలఁచుచునుండునట్టి మగువలఁ జెఱుపన్
   బ్రతిన గలయట్టి నీతోఁ
   బ్రతివచనము లాడుకంటెఁ బాపముగలదే.

ఉ. సంగరరంగమందు నతిశౌర్యమునన్ రఘురాముతోడ మా
   తంగతురంగ సద్భట శతాంగబలంబులఁ గూడి నీవు పో
   రంగను నోప కిప్పుడు విరాధ ఖరాదులపాటు జూచియున్
   దొంగిలి నన్ను దెచ్చితివి తుచ్చపుఁ ಬల్కుಲು వల్కఁబాడియే.

సీ. కూకటిముడికినై కురులు గూడనినాఁడె
              బెదరక తాటకఁ బీచమడఁచె
    గాధేయుఁ డొనరించు క్రతువును రక్షింపఁ
              బెక్కండ్రు దైత్యుల నుక్కణంచె
    నవనిపై విలసిల్లు నఖిలరాజన్యులు
              వ్రేలఁజూపఁగలేని విల్లు విఱిచె
    ఘోరాటవులలోనఁ గ్రుమ్మరునప్పుడు
             ఖరదూషణాది రాక్షసులఁ జంపెఁ