పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

45


సావకాశంగా తమరడిగిన సందర్భానికి జవాబు మనవిచేసుకుంటానని యుక్తిగా అప్పటికి దాంటుకుని అదిపూర్తికాగానే, అంటే గంటకో రెండుగంటలకో అన్నమాట, “యేదండీ బావగారూ! తాము యిందాకా అడిగిన సందర్భం?" అన్నారట. గోపాలశాస్రుల్లు గారు ఆ పనసలో వాక్యం వుచ్చరించి యిక్కడనే నేనడిగిందని చెబుతూవుండంగా పాపయ్యశాస్రుల్లు గారు చెవులు మూసుకొని “నారాయణ, నారాయణ, నారాయణా” అంటూ ముమ్మాలు స్మరించారంట! గోపాలశాస్రుల్లుగారు వెలవెలపోయారంట! కారణమేమిటంటే; పాపయ్య శాస్రుల్లుగారు వేదానికి యెంతవఱకవసరమో అంతవఱకే ఆయా శాస్రాలలో కృషిచేసినారు. గోపాలశాస్రుల్లుగారో? వేదంలో యేకొంచెమో ప్రవేశం చేశారో లేదోగాని ఆయా శాస్తాలల్లో సమగ్రంగా పనిచేసిన మహామహోపాధ్యాయులు. ఈ సంగతి మహాలౌక్యులైన పాపయ్య శాస్రుల్లుగారికి తెలుసును. ఆయన అడిగినప్పడే ఆశంకకు జవాబు చెప్పేటట్టయితే "లక్కికి లక్కి వాదంలోకి దింపి గోపాలశాస్రుల్లుగారు, పాపయ్యశాస్రుల్లుగారిని వోడించడం యేలాగున్నూతప్పదు. కాCబట్టి "అటునుండి నఱుక్కురమ్మన్నారని అప్పటికి మృదువుగానే తప్పకొన్నారు. తిరిగీ ఆ స్థలం అడగడంలో పాపయ్యశాస్తులవారి యుక్తి పూర్తిగా గోచరిస్తుంది. గోపాలశాస్రుల్లు గారికి పుట్టిన వుద్దేశ్యంలో కొంత దోషంవుంది. యేమిటా దోషమంటే యేదో గవడగొయ్యలోకి దింపి పాపయ్యశాస్రులుగారి వాగ్గాటికి అడ్డుకల్పించి గొప్ప సంపాదిద్దామనుకోవడమే. పాపయ్యశాస్రుల్లుగారు దాన్ని కనిపెట్టి యీయన శిరోభారం తగ్గించే వుపాయం యిదికదా అని యీ యుక్తిచేశారు. శాస్త్రంలో కొంతవఱకేనా పాపయ్యశాస్తుల్లుగారు లేశమున్నూ పనిచేయ లేదుగదా? తక్కినదల్లా వుండంగా వుచ్చారణలోనే అనంగా స్వరవిషయంలో తప్పపట్టుకుంటారు. ప్రస్తుతం జరిగిందిన్నీ అదే. వకవేళ 'గోపాలశాస్రుల్లుగారు మహామంత్రవేత్త-మహాజిపిత-ఆమాత్రం వేదవాక్యాన్ని సరిగా ఉచ్చరించనేలేకపోయారా?" అని కొందఱికి శంక కలగవచ్చును. ఉచ్చరించ లేకేమి? ఉచ్చరించే వుంటారు. పాపయ్యశాస్రుల్లుగారు సరియైనదాన్నే కాదంటారు, కాదంటే సమర్థించుకొనేశక్తి ఆభాగంలో గోపాలశాస్తుల్లుగారికి వుందా? “నహి సర్వ స్సర్వం విజానాతి" కదా? ముందు దురుద్దేశంపుట్టిన దెవ్వరికి? గోపాలశాస్రుల్లుగారికి. ಹಿಮ್ಮಿಟ దురుద్దేశంపుట్టడం పాపయ్య శాస్రుల్లు గారికి. వీరు నిజానికి ఛాందసులే అయినా ఆ షడ్డర్శనవేత్తను వోడించినట్లయింది. యథార్థం ఆలోచిస్తే వారున్నూ మహానుభావులే వీరున్నూ మహానుభావులే.

సామాన్యలోకానికి యా ధోరణి పనికిరాదు. కాబట్టి యెంతవారైనా జయాపజయాల కోసం కొంత పెనుగులాట పూర్వం సర్వసమ్మతంగావుండేది. ఇది యినా జన్మంలోనేకాక వుత్తర జన్మానిక్కూడా సంబంధించివుండేదన్నట్టు శ్రీహరుండు (నైషధగ్రంథ కర్త) గారి