పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

404

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రకటించుకోవడానికి మొదలెడతారు. అట్టితోవ నాకు నచ్చదు. నేను ప్రకటించే వినయపుపద్ధతి చూపించనే చూపించాను. కాళిదాసాదులుకూడా ఆత్మనుగురించి అంత అవివేకంగా తిట్టుకొని వినయాన్ని ప్రకటించలేదు. “మందః కవియశఃప్రార్థీ" అన్న శ్లోక మెఱుఁగని అక్షరాస్యులెవరు? నిజంగా అంతచవటయు “అంత అభాగ్యుఁడు" న్నూ తానయివుంటే, అట్టివాఁడు యెంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని సమ్మానించడమే తటస్థింపదుగదా? కాబట్టి స్వవచోవ్యాఘాతపు మాటలతో వినయాన్ని ప్రకటించుకోవడంలో విశేషించి కాని కొంచెంగాని ప్రయోజనం వున్నట్టు నాకు తోఁచదు. తాను వ్రాసే వ్రాఁతకున్నూ తన జీవితానికిన్నీ కొంత కాకపోతే కొంతేనా సంబంధం వుండడం అవసరమని నే ననుకుంటాను. అతివినయాన్ని మనపెద్దలు సుతరామున్నూ అంగీకరించలేదు. అంగీకరిస్తే - "అతివినయం ధూర్తలక్షణం" అని యెందుకు నిర్వచిస్తారు?


★ ★ ★