పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కల్పించడానికి కారణం కొన్నిచోట్ల అధర్మాన్ని తొలగించడానికిన్నీ అని పొడకడుతుంది. కొన్నిచోట్ల అదీ యిదీ కాకుండా ఆ కవులు నిష్కారణంగానే మార్చినట్లున్నూ సూలదృష్టికి కనపడుతుంది. జానకీ పరిణయం, బాలరామాయణం మొదలైనవి దగ్గిఱపెట్టుకొని కుశాగ్రబుద్దులైనవారు విచారణచేస్తే సంగతి సందర్భాలు తేలుతాయి. శ్రుతపాండిత్యం మాత్రమే వున్నవారికిగాని, నూటికి ముపెృఅయిదు వారికిగాని నాటకంలోవుండే కల్పనావిశేషాలు బోధపడక, కవి కథతెలియక పాడుచేశా డనుకుంటారు. అట్టిస్థితిలో తర్కంలో మాట్లాడే పండితుల తారతమ్యాలు శ్రుతపాండిత్యం యెంతవున్నా శ్రీ రాజావారు గ్రహించడం తటస్థించేదేకాదు కాని, - గోపాలశాస్రుల్లుగారు ప్రయోగం చేశారో లేదో దేవుడికెఱుక- వారు కళ్లెల్టజేసి చూడడంవల్ల తాత్కాలికంగా గోపాలశాస్తుల్లుగారికి కల్గినకోపం వ్యక్తమయింది; దానితో అంతకుముందే మనవి చేసుకొన్న సుబ్బన్నశాస్రుల్లుగారి మాటలు తార్మాణంగా రాజావారికి తోcచాయి. దానితో విశేషించి పండితాదరంకల ఆ రాజన్యునకు పండితులంటే అసహ్యం కలిగింది.

పాండిత్యానికి వుండదగ్గ లక్షణం ముఖ్యమయింది సత్యం. అట్టి సత్యాన్ని మన్నించేవారే అయితే గోపాలశాస్రుల్లుగారు రాజావారితో "అయ్యా నేను ఆరుశాస్తాలలో ప్రజ్ఞకలవాణ్ణి. సుబ్బన్న శాస్రుల్లుగారు వకటే తర్కంలో యావజ్జీవమున్నూ కృషిచేసినారు, అందుచేత దానిలో వారిని సాక్షాత్తున్నూ గౌతముండో కణాదుండో అయితేనే తట్టుకోగలరేమో కాని ఇతరులు తట్టుకోలేరంటూ కొన్నిమాటలు తత్కాలోచితంగా మనవి చేస్తే రాజాగారున్నూ సంతోషిస్తారు. సుబ్బన్నశాస్రుల్లుగారున్నూ“అయ్యా నాకన్న గోపాలశాస్రుల్లుగారే గొప్పవారు; యేమంటే : ఆఱుశాస్తాలలో పూర్ణ పండితులుగదా వారు?” అని చెప్పిస్తుతిచేసివుందురు. అలాకాక రసాభాసంగా లోకులు చెప్పకొని కళంకాన్ని ఆపాదించే తోవలోకి గోపాలశాస్రుల్లు గారు దిగి, తమకేకాక పండితలోకానికంతకున్నూ తీరనికళంకాన్ని దెచ్చిపెట్టారని వ్రాయకతప్పదు. పాండిత్యమెంత ఉన్నప్పటికీ లౌకిక జ్ఞానం కొంతవుండాలి. యుక్తినైపుణ్యం కొంత వుండాలి. అప్పడుగాని ఆ పాండిత్యం శోభించదు. యీ సందర్భాలన్నీ ವಿನ್ಸಿಲ್ಲು వక్క బులుసు పాపయ్యశాస్రుల్లు గారినే పండితమండలి యేకవాక్యంగా అంగీకరిస్తుంది. మచ్చుకు ప్రకృతానికి సంబంధించిందే వక యితిహాసం వుటంకించి వ్యాసం ముగిస్తాను.

విజయనగరంలోనే శ్రీ పాపయ్యశాస్తుల్లుగారు మహా పండితసభలో వేదార్థం చెపుతూవున్నారంట. యొక్కడో సంశయంగా ವೊವ್ಲಿಲ್ಲು తోcచి కొవ్వూరు గోపాలశాస్రుల్లుగారు, “బావగారూ! ఆ స్థలంలో మళ్లా సెలవియ్యండీ” అని పృచ్చచేశారంట. దానిమీద పాపయ్యశాస్తుల్లుగారు- "బావగారూ, యీ తరవాయి మనవిచేశాక తుట్టతుదకు