పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

403


యింతకాలం వుండడానికి అవకాశం కలిగిందనుకుంటానునేను. దీన్ని లోకం యెంతవఱకు విశ్వసిస్తుందో?

పుట్టెఁడాముదం వ్రాసుకొని పొర్లినా యశస్సు పూర్వపుణ్యం వుంటేనేకాని రాదు. యీ మాట నే నిప్పుడే వ్రాయడంలేదు. యిదివఱలో ఆరోగ్యకామేశ్వరిలో కూడా వ్రాశాను. శా|| ఈజన్మమ్మునఁ గొంచెమేయనుము మున్నేజన్మమందైన నీపూజన్ బూర్తిగఁజేసె వీడదికతమ్ముంజేసియే లోకమున్ బూజించెన్... ... కామేశ్వరీ, తాదృశపుణ్య హేతుకమైన కీర్తిని పోఁగొట్టఁగలవారుంటే పోఁగొట్టుదురుగాక. వారికి కూడా పుణ్య పరిపాకం వుంటే కీర్తి కలుగుcగాక. “పుణ్యైర్యశో లభ్యతే, నాన్యథా, నాన్యథా, నాన్యథా."

పూర్వపుణ్యమనడానికే కొందఱు జాతకబలిమి అనడం కలదు. ఆమాటకూడా నేను వకచోట సభలోనే వాడివున్నాను. -

(వేమవరాగ్రహార శతావధానమునుండి)

చ. జననపులగ్నమం దలరు శక్రగురుండును శుక్రుఁడున్ గుజం
    డును నల రాహువు న్నను ఘనుంబొనరించెడి నంతెకాని యే
    నును నొక సత్కవీశ్వరుఁడనో! తిరపయ్యయు నొక్క మేటియో!
    యనఘ కవిగ్రహంబులు, గ్రహంబులు గవ్వనుజేయు వజ్రమున్.

యీ యంశాన్నే భంగ్యంతరంగా వకచోట కొలఁది కాలంనాఁడు వ్రాసివున్నాను. ఆ పద్యం "విక్రమ చెళ్లపిళ్ల" అనే వ్యావహారికభాషా పుస్తకంలో మీరు చదువుతారు. అయినా దాన్ని కూడా వుదాహరిస్తాను.

శా. నీ కారుణ్యమకాక యేనృపతిగానీ వీనిఁ బూజింపఁగా
    నీ కాలమ్మున నెంతపాటికవియో! యేమంతవిద్వాంసుఁడో!
    నీకే స్పష్టము, వీనిముం దొకరుఁడేని నిల్చి గట్టెక్కెనే?
    మోకాల్బంటియె నీ కటాక్షమున నబ్దుల్ నాకుc గామేశ్వరీ!

యెంత వినయం కోసం వ్రాసినా ఆయీ పద్యాలలో కొంత గర్వస్ఫూర్తి లేకపోలేదు. కొందఱు సకలశ్రమలూపడి యేవో గొప్పకు కావలసిన ప్రయత్నాలుచేసి వాట్లను అనుభవించే సభలో వినేవాళ్లు లోలోపల నవ్వుకుంటారనేనా ఆలోచించక, నేను వట్టిచవటను, అభాగ్యుఁడను యేమో? యేమో? యేమో" అంటూ వినయాన్ని