పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/397

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

401


“పశ్యశబ్ద" ఘటితమైన సమస్య నెవరో యెవరినో అడిగి తెచ్చి సభలో అడగడమేమిటి? అడిగితే అడిగారుగాక, వెంll శా|| తప్పనడమేమిటి? దానిమీఁద విధిగా తి|| వెం|| కవులు దొరుకడ్డారనుకొని ప్రతిపక్షులు విజృంభించినకొద్దిన్నీ తి|| వెం|| కవులు చేతంగానివాళ్లవలె వెనక తగ్గినట్లు నటిస్తే ప్రతిపక్షులు మఱీ మఱీ తొక్కుకురావడమేమిటి? ఆవాదం అంతతో ఆఁగక ఆంధ్రదేశపు పండితులలో అనేకులను చుట్టుముట్టడమేమిటి? తుదకు దానిలో ఆవలివారికి మార్గాంతరం లేకపోవలసి రావడమేమిటి? కాశికామతాన్ని ఖండించడానికి తగ్గ లక్ష్యం ఛందోవ్యతిరిక్తమైనది అప్పటికే కాదు యిప్పటికిన్నీ ప్రతిపక్షులకు చిక్కక పోవడమేమిటి? యిదంతా దైవ విలాసం కాక మఱేమనుకోవాలి? అందుచే ప్రతిపక్షులు ఒకపని చేస్తే బాగుంటుందనుకుంటాను. తి|| వెం|| కవులు శుద్ధ శుంఠతావచ్ఛేదకకోటిలో వాళ్లు, వాళ్లకు దైవం సహాయం చేసి పేరు ప్రతిష్ఠలు తెప్పించింది. లేకపోతే మనముందు నిలుస్తారా? అనుకొని యెంతవఱకు సంతోషించాలో అంతవఱకు సంతోషించి తృప్తిపడడం యుక్తమనుకుంటాను. గుంటూరు వివాదాలలో ఒకాయన యేలా వ్రాశారో చూడండి-

సీ. ప్రబలగద్వాలభూపాలభర్మధరాధ
               రమ్మున భూరివ్రజమ్ము గొనుట
    ఆత్మకూర్ప్రాజ్యరాజ్యమదేభములనెక్కి
               వీధులలో విఱ్ఱవీఁగి చనుట
    గజపతిక్ష్మాపాలనిజకరార్పితకాంచ
               నాదులఁగొని చింతలేది చనుట
    పోలవరక్షమాలోలాభ్యుదయకీర్తి
               కాంతమన్ననలను గాంచి మనుట

తే.గీ. సరససుకవిత్వసంధానచాతురీణ
      ధీవిశేషపాణింధమశ్రీవిలాస
      గరిమనని యెంచుచుంటిమక్కట! పురాణ
      వాక్కలనఁ గాని యన్యమ్మువలనఁగాదు.

మమ్మల్ని చూడనప్పుడు పొరఁబాటుగా తి|| వెం|| కవులంటే యేమో మిణికారు కాcబోలునని అనుకొనేవారఁట ఆయన! తీరా చూచేటప్పటికి, పురాణం చెప్పి ఆయా సమ్మానాలు పొందినట్లు తెలిసికొన్నారఁట! యింతకూ ఆయనకు అప్పుడు కావలసిన ముఖ్యాంశమేమిటి? కవిత్వం తి|| వెం|| కవులకు బాగా తెలియదనేది. దాన్ని ఆ రీతిగా సమర్ధించి ఆయన సంతుష్టి పడ్డారు. దాన్ని గుంటూరుసీమలో ప్రకటించి వున్నాము.