పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/396

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

400

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అనడానికి బదులు “నీకు తి|| వెం|| కవులతో వాదంరాను" అంటే సరిపోతుందనుకుంటాను. వెనక యెవరో పాలెపు వెంకప్పగారని వక రుండేవారఁట. వారు సంతానం లేక పెంపకం చేసుకుంటే, యెన్నిసార్లు పెంచుకున్నప్పటికీ నిలిచింది కాదఁట! యీ కారణంచేత లోకంలో ఆ పెంపు వక తిట్టుగా పరిణమించిందఁట! అనఁగా “నీవు చచ్చిపోను” అనడానికి బదులు, “ఫలానావారు పెంచుకోను” అనడానికి మొదలెట్టారఁట! ఆలాగే ప్రస్తుత విషయమున్నూ

తేలినసారం; మాకేమేనా నామరూపాలు లోకంలో వుంటే దానికి పూర్వపుణ్యవిశేషం అప్రత్యక్షకారణమున్నూ ప్రత్యక్షకారణం మమ్మల్ని వృథాగా కదిపి "గిల్లి కజ్ఞా" పెట్టుకొనే శత్రువులనిన్నీ స్పష్టంగదా? యీ శత్రువులను మేము మిక్కిలిగా అభినందించడం తప్పదు. యితర విషయంలో పనిలేని పాటగా "స్త్రీలను" అనే ప్రయోగం తప్పంటూ వ్రాసి, అనంగా - మహత్యర్థకానికి, సప్తమ్యర్థకముగా ద్వితీయ నుపయోగించాఁడనీ, గోర్కెలు అని యెత్వఘటితంగా ప్రయోగించాఁడనీ, “చూపఱు” అనడానికి “చూపరులు" అన్నాఁడనీ, యింకా యేమో అన్నాఁడనీ ఆక్షేపించడానికి మొదలుపెట్టారు. యీ ఆక్షేపణాలన్నీ ఆక్షేపకులకు అపజయాన్ని కలిగించేవే అని అన్యత్ర దిఙ్మాత్రం వ్రాసి వున్నాను. యావజ్జీవమున్నూ తి|| వెం|| కవులు వారిమీఁదకు వచ్చిన వారిని వోడించడమే అన్యంలేదు అనే యశస్సు సంపాదించిపెట్టడానికేగాని యితరవిషయంలో యీ అంశం ఆవలి మహనీయులు యెందుకెత్తుకుంటారో విజ్ఞులు విచారించండి,

కొంతమంది మమ్మల్ని తిట్టాలని కోపంతో వ్రాఁతకి మొదలెడతారు, దానిలోకూడా మమ్మల్ని గొప్పఁజేసే మాటలే పడతాయి. "గంధర్వలోకం"లో నుంచి ఒకాయన యేలా వ్రాశారో చూడండి.

సత్కవీ! 'నీదు ఘన గౌరవము' 'కవీశ్వర!' 'నీబోటి శతావధానపరిపూర్జునకు’ ‘మహాత్ముఁడ!'

యిత్యాదులు ఆ గంధర్వలోకస్థుని దూషణవాక్యముల నుంచి జల్లిస్తే దొరికాయి. చూచారా, యిదేమనుకోవాలి? దైవ మాలా ఆయనచే అనిపించాcడనేనా? లేక ఆ గంధర్వలోకస్థునికి వెంll శాII మీఁద గౌరవముండే అట్లా వ్రాశారంటారా? యివన్నీ యీలా వుంచుదాం. గద్వాలలో యేమి, ఆత్మకూరిలో యేమి, యేవిధమైన వాదోపవాదాలూ లేని పద్ధతిని యే పండ్రెండు రూపాయిలో యిచ్చి పంపడంతప్ప యితర గౌరవాలకు అవకాశం లేశమున్నూ లేదుకదా? ఆ వాదోపవాదాలు యితరుల కేల లేకపోవాలి? తి|| వెం|| కవులకే యేలా కలగాలి? దైవమే కారణ మనుకోవాలికదా? నరసారావుపేటలో