పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

399


దైవహేతుకమే అని నా విశ్వాసం. పెద్ద పెద్ద పండితుల సాయంతో విమర్శిస్తూవున్న ఆ విమర్శనలో "క్షమాపణ" అనే పరిశుద్ధమైనశబ్దం "నింద్యగ్రామ్యం"గా లిఖింపఁబడడం కూడా దైవహేతుకమే అనుకుంటాను. ఆయీ సందర్భాలన్నీ దైవహేతుకాలేగాని, మా ప్రజ్ఞవల్లఁగాని, ఆవలివారి ప్రజ్ఞాలోపంవల్లఁగాని కలిగినవి కావని వ్రాయడంవల్ల కలిగే లాభమేమిటంటారా? లోకంతోపాటు అహంకారనిరాసను చూపడం వకటికదా? అబ్బో, యింతమాత్రం చేత తి|| వెం|| కవులు అహంకారపూరితులు కారనుకోదు లోకమంటే వినండి:- అదిన్నీ సత్యమే. యిపుడు నేను అనారోగ్యంగా వుండడం చేతనైతేనేమి, తి|| శాI| గారి సాహాయ్యం పోయి చాలాకాలం కావడం చేతనేమి, కొందఱు "గిల్లికజ్జాలకు" దిగుతూవున్నారు. వారికి యీలా మనవిచేసుకుంటే యేమేనా నచ్చుతుందేమో అని కూడా నా ఆశ. దైవోపహతులుతప్ప మామీఁదకు రారనిన్నీ మా విజయానికి కారణం దైవం గాని మా ప్రజ్ఞ లేశమున్నూ కాదనడానికే నేనీవ్యాసం వ్రాయడం. నీకు విజయమే లేదనిగాని, నీకు పేరుప్రతిష్ఠలే లేవని కాని యెవరేనా అనేయెడల వారు నాకు పరమోపకారులు. యెందుచేతనంటే అట్టిమాపుస్తకాలను వెక్కిరించడానికి యెవరున్నూ ప్రయత్నించరుకనుక ఆలాటి అభిప్రాయాన్ని వాళ్లకు కలిగించక మాపైకి 'గిల్లికజ్జా'కు పురికొల్పడమున్నూ దైవంపనే అని నా నమ్మకం. నా నమ్మకాన్ని సమర్ధించేవి కొన్ని వుదాహరణాలు యిదివఱకే చూపివున్నాను. మరికొన్ని కూడా చూపుతాను.

(1) "మన కవిచంద్రుఁడుగారు శ్రీరాగమెత్తుకొని సభలలో నానా రాజసందర్శనము లోని పద్యములు చదువుచు నుపన్యాసము చేయునప్పుడు సభయంతయు వింజమాకిడి నట్లుండును. ఇది వీరి పూర్వపుణ్య విశేషము”

(2) అమేధ్యపదార్ధములం దగుల్కొన్న యగ్నికి నశుచిత్వమంటనట్లును... తాను శుద్దుఁడైనచో నెట్టి దుష్టులతో సహవాసము చేసినను... ... "

యీ రెండు వాక్యాలున్నూ వేం|| శా|| మీఁద యెంతో ఆగ్రహంతో వ్రాసే మహనీయుల వాక్యాలలో నుండి తీసినవి. ఇవి వ్రాసినవారు మహాకవులు. ఇందు వేం|| శా|| పూర్వపుణ్య విశేషం కలవాఁడనే అంశమే కాక అగ్నివంటివాఁడనికూడా స్పష్టంగా తేలుతూవుందికదా? యీ వూహ శత్రువులకు కలిగిందని నేను వ్రాయడానికి చదువరులు సమ్మతించే యెడల, అగ్నిహోత్రంలో దుముకుట యెట్టిదో వేం|| శాII తో వివాదం పెట్టుకోవడం అట్టిదే అని శత్రువులుకూడా వొప్పకున్నట్లయిందికదా?

ఇట్టి పూర్వపుణ్య విశేషం కల తి|| వెం|| కవులతో “గిల్లికజ్జా"కు దిగేవారు దైవోపహతు లనడానికి వప్పనివా రుండరనుకుంటాను. అయితే లోకంలో “నీకు అవమానం రాను”