పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

43


చంద్రవతీ గుణవతులనే ముగ్గురిని అప్పాచెల్లెళ్లను గాంధర్వరీత్యా పరిగ్రహించి వున్నారు. పినతండ్రి పెత్తండ్రికొమార్తలైన యీకన్నియలను పెండ్లాడిన వీరలుముగ్గురును అన్నదమ్ములవావివారుగా వుండడమే అర్దమో, తండ్రీ కొడుకులవావివారుగా వుండడమే అర్హమ్లో, ఆలోచించవలసివుంటుంది. ఇందులో వక వరుడు కృష్ణమూర్తికి తమ్ముడున్నూ తక్కిన యిద్దరున్నూ కొడుకులున్నూ, అయేపక్షంలో యిద్దఱు తల్లికి మొగుళ్లు కావలసివస్తుంది. యిదిన్నీ యిలావుండగా యించుమించు సమానవయస్సులోవుండే ΟDJo కన్యకలకు సమానవయస్సులో వుండే భర్తలైతేనే అనుకూలదాంపత్యంలోకి చేరుతుంది కాని దాంపత్యం, లేకపోతే ముదురు మొగుడున్నూ లేత పెండ్లాముగా వుండడం తటస్థించి రసాన్ని చెడగొడుతుంది, పోనీ యీ దాంపత్యాలేమేనా యిప్పడు లోకంలో ధనాపేక్షచేత ముసలాడికి పసిపిల్లను కట్టిపెట్టే రకంలోకి చేరతాయేమో అంటే, అట్టివికావు. పరస్పరమున్నూ గుణవయోరూపాదులను పురస్కరించుకొని యేర్పఱచుకున్నవి. కృష్ణమూర్తికి తమ్ముడైన గదుండే పెళ్లికొడుకులలో వకండుగా వున్నట్టయితే అతCడు కృష్ణమూర్తికి యెంత కడగొట్టుతమ్ముడైనా ప్రద్యుమ్నాదుల వయస్సులోవాడు కాండని వారివీరి జన్మసందర్భాలను విమర్శిస్తే తేలుతుంది. చచ్చిచెడి యెట్లో వయస్సు యించుమించులో సరిపెడదామన్నప్పటికీ వావి కుదరదు. ఆయీ సందర్భాలు అన్యత్ర విస్తరించందలంచుకొని వూరికే స్ప ృశించి విడుస్తూ వున్నాను.

దీనిమీద పట్టేశంకలు చాలా వున్నాయి. (1) కృష్ణమూర్తికి గదుండనే పేరుగల తమ్ముఁడే వున్నాండు గాని గదుcడనే కొడుకున్నాండా? (2) అయితే యీ మార్పు కవికులాగ్రేసరుండైన పింగళి సూరన్నగా రెందుకు చేయలేదు? యిత్యాది శంకలకు చక్కని సమాధానాలున్నూ వున్నాయి. కృష్ణునికొడుకు లెందటో, వారివల్ల ఆ వంశం యెంత అభివృద్ధి చెందిందో, ఆ సంతానంలో భాగవతాదులలో యెన్నోవంతు వారిపేర్లు వుదాహరింపబడ్డాయో యెఱిఁగినవాళ్లు పై శంకలు చేయరు. యాదవ కుమారులకు విద్యాభ్యాసం చేయించే గురువులు మూడుకోట్ల యెనభైయెనిమిదివేలని కాబోలును భాగవతంలో వుంది. ఒక్కొక్క గురువు యెందఱికి పాఠంచెపుతాడో ఆలోచించి ఆ సంఖ్యనుబట్టి ఉపాధ్యాయుల సంఖ్యను గుణిస్తే సుమారు ముప్ఫై కోట్లేనా సంఖ్య తేలుతుంది, ΟΟΟΟ ముప్టెకోట్ల యాదవకుమారులకున్నూ మూలపురుషులైన కృష్ణునియొక్కానున్నూ ఆయన సోదరులయొక్కానున్నూ కుమాళ్లు అధమం వక లక్షవరకేనా వుండవలసి వస్తుంది. ఆ లక్షలో కృష్ణుడికుమాళ్లు వక వెయ్యేనా "అట్టీస్టు" వుండరా? ఆ వేయి మందిలో గదుడనే కొడుకుకూడా పినతండ్రి పేరింటి వాండు వుండంగూడదా? యిత్యాదికం వూహించుకోవాలి. యీలాటి అభూతకల్పనలు నాటకాలలో చాలావున్నాయి. ఆలాగ ఆయాకవులు