పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

393

 అనేవారిమాటలు నేను బహుధా వినివున్నాను. విమర్శించిచూస్తే దీనిలో స్వోత్కర్ష బోలెఁడు ప్రకటిత మవుతూ వుందని తేలుతుంది. పండితరాయలు కాఁబోలును -

"ఆమూలాద్రత్నసానోః...కో౽స్తిధన్యోమదన్యః" అని పెళపెళమంటూ వక స్రగ్దరావృత్తంలో స్వాతిశయాన్ని ప్రకటించుకోవడంచేత ప్రతివారికిన్నీ గర్విష్ఠుఁడుగా కనపడతాఁడు. వాచ్యంగా దీనిలో యెంత స్వాతిశయం ప్రకటితమవుతూఉందో, వ్యంగ్యంగా దానిలోనున్నూ అంత స్వాతిశయమున్నూ ప్రకటితమవుతుంది. సందేహంలేదు. మహావేదాంత గ్రంథంగదా భగవద్గీత - దానిలోకూడ శ్రీకృష్ణభగవానుఁడు సహా స్వాతిశయప్రకటనము చేసికొన్నట్లు తీయవచ్చు. యెందుచేత? వొక్కొక్క సందర్భంలో ఆలాచెప్పక విధిలేదు. కాఁబట్టి ఆలా చెప్పడం తటస్థించింది.

యిక ప్రస్తుత మేమిటంటే లోకులందఱూ చదువుకున్నట్టే తి||వెం|| కవులున్నూ చదువుకున్నారనిగాని, అంతకన్న కొంచెం తక్కువ చదువుకున్నారనిగాని చెప్పవచ్చు. అట్టిస్థితిలో వీళ్లిరువురున్నూ "సమానానా ముత్తమశ్లోకోస్తు" అనే శ్రుతికి వుదాహరణంగా వుండడం తటస్థించింది. దీనికి సంతోషించేవారు చాలామంది వున్నా విచారించేవారు కూడా కొందఱు వుండడం తప్పదుగదా? అందుచేత వారిని విద్యార్థి దశనాఁటినుండిన్నీ పలువురు ద్వేషిస్తూవుండడం తటస్థించింది. కాని ఆ ద్వేషించేవారివల్లనే వీరి విద్యావృద్ధిన్నీ దానితో యశోవృద్ధిన్నీ దానితోపాటు ధనాభివృద్ధిన్నీ కలుగుతూవచ్చింది. దేశంలో మొట్టమొదట వీరికి విద్యావిషయమైన వాదోపవాదాలు అంతగా తటస్థించలేదుగాని నైజాంయిలాకా సంస్థానాలలో సుమారు 24-25 యేండ్ల వయస్సులో తటస్థిస్తూవచ్చాయి. ఈ దేశంలోనల్లా మొట్టమొదట ముమ్మిడివరంలో వకరితో వచ్చింది వాదం. ఆయనే కాకినాడలోకూడ అడ్డుతగిలి వోడిపోయారు. అదృష్టంవల్ల యశస్సు వస్తుందనడానికి యీ కాకినాడలో తటస్థించిందే ప్రథమోదాహరణము. యేమంటారా? మొదట వుపజాతి వృత్తాన్ని వుపజాతివృత్తంకాదనిన్నీ సీతావివాహాన్ని సీతావివాహం కాదనిన్నీ ఆక్షేపించిన పండితుఁడి కెంతతత్త్వం తెలుసునో ఆ విషయంలో వీరికిన్నీ అంతే తెలుసును. తీరా ఆయన ఆక్షేపించాక యిందులో చిన్నప్పుడు చదువుకొన్న రఘువంశద్వితీయసర్గ మొదటి శ్లోకంవల్ల వృత్తాన్ని గూర్చి ఆయన ఆక్షేపించడం ఖండించఁబడ్డది. అప్పటికప్పుడే వ్యాకరణంలో చాలావఱకు గ్రంథాలు అయివుండడంవల్ల “ఏనాం” అనేదానిలో "సీతాకళ్యాణాన్ని" కుయుక్తిచే సాధించేప్రజ్ఞ అలవడింది. యిందులో చాలామట్టుకు అదృష్టబలమే కనబడుతూవుందా?

తరువాత విజయనగరంలో కాఁబోలును, అవధానంలో వక మహాపండితుడు వసుచరిత్రలోవున్న వక కల్పన యిచ్చి పద్యం చెప్పమన్నాఁడు. దానిమీఁద ఆ కల్పన