పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

390

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

మాయీ అనుబంధానికి యేవో కొన్ని బహిఃకారణాలు కనపడినా అంతఃకారణం దైవనిర్ణీతమయింది యేదో ఒకటి వుండితీరుతుంది. లోకం చెప్పుకొనే మాటలకేమి? కొన్ని నిజాలూ వుంటాయి. కొన్ని అసత్యాలూ వుంటాయి. అవి యెప్పుడూ అంతరించేవి కావు. సుమారు అప్పటి నా నివాసగ్రామం యానానికి ఆఱేడు ఆమడలదూరంలో వున్న అతనిపేరు తిరపయ్యేమిటి? నాపేరు వెంకన్నేమిటి? మేమిద్దఱమూ తిరుపతి వేంకటేశ్వరులుగా కలుసుకోవడ మేమిటి? యిది దైవనిర్ణయమంటారా. మనుష్య నిర్ణయ మంటారా? యిటీవల యెందఱో జంటకవులు బయలుదేఱినా యీ విధంగా పేరులు కలశాయా? కొందఱు నేఁటికికూడా "తిరుపతి" అనేది యింటిపేరనే అనుకునేవారున్నారు. కొందరు తిరుపతిలో వుండే కవులు గనక తిరుపతికవులని అనుకొనేవారున్నారు. కొందఱు యీమా కడియం గ్రామానికి నాపేర వుత్తరం వ్రాస్తూ “తిరుపతి శాస్త్రులుగారికి” అని యిప్పటికి వ్రాయడంకలదు. సుమారు పుష్కరకాలం దాఁటినా తిరుపతిశాస్త్రులు యింకా వున్నాఁడనుకున్నారనుకోవాలా? లేక స్వర్గతులైనవారు యీ యిద్దఱిలో యెవరో తెలుసుకోలేకపోవడంచేత యీ తబ్బిబ్బు కలుగుతూ వున్నదనుకోవాలా?

ఆయీ సందర్భాలన్నీ తిరుపతి వెంకటేశ్వరకవులకు వుండే ఐకమత్యం అనన్యసామాన్య మనే అంశాన్ని బోధిస్తాయి. తేడాపాడాలకేమి? యేవో లవలేశాలు వుండకపోవు, వాట్లని కొందఱోలాగా, మఱికొందరు మఱోలాగా చెప్పుకుంటూ వుంటారు. యెన్నో యింకా యీలాటి వున్నాయి. విస్తరభీతిచేత వదులుతూవున్నాను.

నావిషయం రాకుండా అతని విషయమే వ్రాయడానికి యేర్పడ్డ యీ వ్యాసంలో చాలాచోట్ల నావిషయంకూడా యేకొంచెమో కాక విస్తారంగానే తగులుతూ వచ్చింది. యెవరేనా వ్రాయవలసి వస్తే యింతకన్న బాగా వ్రాయఁగలరేమో? మాకూ మాకూ వుండే అనుబంధాన్ని బట్టి వకరిని తప్పించి వకరినిగూర్చే వ్రాయడానికి వీలిచ్చింది కాదు. అంతేకాని దీనిలో నా గొప్పతనాన్ని కూడా వెల్లడించుకోవాలని నేను ప్రయత్నించలేదు. అతణ్ణిగూర్చి వ్రాసేది సమస్తమూ విద్యకు సంబంధించిందయితే లోకం నాకూ అన్వయించుకుంటుంది. నన్ను గూర్చి వ్రాసేదిన్నీ అంతే. అట్టి స్థితిలో "యేడ్చినదాని మగఁడొస్తే యేకులొడికినదాని మగఁడూ వస్తా"డని వూరుకుంటే బాగుండదా? బాగుంటుంది. కాని చంద్రచంద్రికాన్యాయంగా సంచరించిన మా సంచారాన్ని ఆలా వ్రాయడానికి అవకాశం కలిగింది కాదు.

లోకులు అనుకునే స్వల్పభేదాలు వ్యక్తిభేదాన్ని ಬಲ್ಜಿ కొన్ని సత్యదూరాలున్నూ కావు. కొన్ని మాత్రం సత్యదూరాలే. యితరవిషయాలంటే? పాండిత్యభేదాన్ని గురించి మాట్లాడుకొనే