పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కూర్చున్నామనుకోండి. ప్రతివాదులు అనుకొన్నట యిముకు రానేలేదనుకోండి. ఆపట్లాన్ని ఆవలివారు వోడిపోయినట్టే. యిఁక మనం యిక్కడ వుండనక్కఱలేదు. పోయి యిలా పత్రికల్లో ప్రకటిద్దామనేవాఁడు. యీలాటి విద్యావిజయాలూ, కోర్టుద్వారాగా సంపాదించే విద్యావిజయాలూ, బాకీ తార్మానాలూ యివి యశఃకాములు అంగీకరించతగ్గవేనా? నోటుకు సహకాలదోషం పడితే ఘరానామనుష్యులు దాన్ని గణించక మళ్లీ తిరగరాసి యివ్వడమో, సొమ్మే యిచ్చి లేదనిపించుకోవడమో చేస్తారు. చేయరే అనుకోండి. అంతమాత్రంచేత ఋణంతీర్చినట్టు లోకం విశ్వసిస్తుందా? అని దానికి నేను సుతరాము వొప్పుకొనేవాణ్ణికాను.

అతఁడు నాకన్న చాలా విషయాలలో ఛాందసుఁడుగానే వుండేవాఁడు గాని, యీలాటి - విషయాలు కొన్నిటిలో లౌకిక మర్యాదలకు లోఁబడేవాఁడు. నాకు యీలాటి విషయాలకేమి, - వేషభాషలకేమీ ఛాందసుల ఆచారాలే యిష్టం. వాఁడికి యింగ్లీషు చదువంటే కొంత యిష్టం. అందుచేతే చిరంజీవులకందఱికీ దాన్నే చెప్పించాఁడు. నాకో, మనపూర్వపు చదువే చాలా యిష్టం. అందుచేతే - “పై జననమ్మందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్" అని సంతానం కలక్క పూర్వం చెప్పిన కామేశ్వరిలోనున్నూ కలిగిన తర్వాత చెప్పిన ఆరోగ్య కామేశ్వరిలో,

మ. “కలిగెన్ లేదనుకొన్న సంతతియు భాగ్యం బబ్బె నానందని
      స్తులమయ్యెన్ జని షష్టిపూర్తియును నాకున్ దాపు గావచ్చెనో
      లలితాంబాఁ యిఁక నొక్కకోర్కె అది వాలాయంబు మద్విద్యల
      ర్మిలి మత్పత్రులయందమర్చుటయె సుమ్మీ తల్లి కామేశ్వరీ!"

అనిన్నీ వ్రాసివుండడమే కాకుండా, మా రెండో చిరంజీవి యేమాత్రమో కవిత్వం చెప్పడమే కాకుండా హైదరాబాదులో అవధానం చేసినట్టు యేకలవ్యశిష్యులు వ్రాయడానికి వుబ్బి తబ్బిబ్బై షష్టిపూర్తికి దరిమిలాను "ఇటీవలిచర్య అని వ్రాసుకుంటూవున్న నా జీవితచరిత్రలో ఒకపద్యం నా అభిప్రాయాన్ని తెలిపేదాన్ని

క. “నాకొమరుం డే మాత్ర
    మ్మో కవియై నా కొసంగు మోదమ్మను శ్రీ
    "హైకోర్టు ఛీపుజడ్జీ"
     యైకూడ నొసంగనేరఁ డనుకొందు మదిన్."

అనే మాటలతో వ్రాసివున్నాను. యిప్పుడు యెన్ని పరీక్షలు ప్యాసైనా వుద్యోగభాగ్యం - లేకపోవడ మనేది యెందఱో బ్రాహ్మలకు విచారకరమైనా నాకు సంతోషకరమే అయింది.