పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

41


ఋజువివ్వడం కలిగిందనుకోండి. ఆయన మాత్రమేకాక ఆయనకు ముఖ్యశిష్యులైన అద్దేపల్లి కృష్ణశాస్రుల్లుగారివల్లకూడా కొంత యీశాస్త్రంబుజువిచ్చే వున్నట్లు వినికి. వకగొప్ప షాహుకారు కృష్ణశాస్రుల్లుగారివల్ల రావలసిన కొన్నివేల పరిమితిగల అప్పపత్రాన్ని భయపడి యిచ్చేసినట్లు చెప్పుకోవడం నే నెఱుంగుదును. యిప్పుడు మనం మంత్రశాస్త్రప్రజ్ఞనే విచారించి సంతోషించడమా కావలసింది?- గోపాలశాస్రుల్లుగారు చేసిన అకార్యాన్ని నిరసించడమా?- అంటే, దేనికదే వుంటుందికాబట్టి దాన్నీ ఆలోచించవలసిందే, దీన్నీ ఆలోచించవలసిందే. మహాపండితులై వుండి బ్రహ్మహత్యకు సిద్ధమయినారు కనుక గోపాలశాస్రుల్లుగారు యిప్పట్ల దూష్యులే. అయితే వూరికే ఆయనకువుండే ప్రతీతినిపట్టి సుబ్బన్న శాస్రుల్లుగారు "రజ్ఞసర్పభ్రాంతి"గా హడిలి బేజారై వాక్కుపడిపోవడమే కాకుండా క్రమంగా స్వర్గతులవడంకూడా తటస్థించిందేమో, అంటారా? అయితే గోపాలశాస్రుల్లుగారు దూష్యలుకారు. పాపం పుణ్యం పరమాత్ముడికే యెఱుక. మనకు ముఖ్యంగా కావలసినది సుబ్బన్న శాస్రుల్లుగారి పాండిత్య ప్రసంగం. అది నిరుపమానం అనే సంగతి ఆనాటి సభవల్ల ತೆಲಂದಿ.

యీ సుబ్బత్రయాన్ని మెప్పించినవారు కురుగంటివారిలో వకరు వుండేవారంటూ గురువుగారు సెలవిచ్చేవారు. వారిపేరు వేంకటరామ శాస్రుల్లుగారని విన్నట్లు జ్ఞాపకం. తాడెక్కేవాణ్ణి తలదన్నేవాఁడున్నూ వుండవచ్చునుగదా? విద్యావివాదాలంటూ యిప్పడున్నూ పత్రికలలో జరుగుతూ వుండడం అందఱికి అనుభూతమే. కాని యిప్పటివారికి మంత్ర శాస్త్రప్రజ్ఞలు లేకపోడంవల్ల వోడుకలగటం తటస్థిస్తే వట్టి శాపాలు మాత్రం పెట్టడం తటస్థిస్తూవుంది. ఆ శాపస్వరూపం పత్రికలలో చదువుతూనే వున్నారు కాCబట్టి యిందులో యెత్తిచూపలేదు. అవమానం మహాచెడ్డది. కొంచెం నామరూపాలు కలవాళ్లు దాన్నిబొత్తిగా భరింపలేరు. మృచ్ఛకటికలో యేమన్నారో చూడండి

"నిస్తేజాః పరిభూయతే పరిభవాన్నిర్వేద మాపద్యతే నిర్విజ్ఞశ్ముచమేతి శోకపిహితో ಬುದ್ಧ పరిత్యజ్యతే నిర్బుద్ధిః క్షయమేతి-"

తుట్టతుదకు అవమానం మరణాన్ని కూడా సాక్షాత్పరంపరయా కలిగిస్తుంది. కాcబట్టి అది తటస్థించినవారు యొదటివాళ్లను శపించడానికిదిగడం తప్పదనుకుంటాను. దీనిలో వకవిశేషం గమనించవలసివుంది. యేమిటంటే విద్యావిషయంలో జరిగేవాదోపవాదాలలో జయాపజయాలు నిర్ణయించడానికి తగ్గ శక్తిసామర్థ్యాలు యెవరికోగాని వండవు, వారుకూడా ఆ జయాపజయాలు తెలుసుకోవడానికి యీ శాపాలు ఆధారమవుతాయి. యెవరు తిట్లకువుపక్రమిస్తారో వారికి అపజయం కలిగినట్లు సుళువుగా తేలుతుంది. ప్రస్తుతం