పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

369


పట్టి పల్లార్చే స్వభావం కలవాఁడు కాఁడు. "సుగ్రీవబొబ్బ" అన్నట్టు వొక బొబ్బపెట్టి మళ్లా దాన్ని తలపెట్టేదే లేదు. నాచేదస్తం ఆలాటిది కాదు. అది తేలేదాఁకా నిద్రాహారాలు సమేతూ తోఁచకపోవడం నా ప్రకృతిలో వుంది. దీన్ని తప్పించుకోవాలని నేనైతే చాలా ప్రయత్నంచేసి చూచానుగాని ప్రయోజనకారి కాలేదు. దీన్ని అతఁడు యెప్పుడూ గర్హిస్తూ వుండేవాఁడు.

ఇంకోటి - తోఁచిందేదో చట్టనవ్రాసి పాఱేయడమే కాని దాన్ని మళ్లా పరిశీలించడ మంటే అతనికి పట్టేదికాదు. నేను మళ్లామళ్లా చూడడమే కాకుండా వ్రాసినదాన్ని యెందఱికో వినిపిస్తేనేకాని నాకు తోcచకపోవడంకూడా వుంది. (యీసంగతి లోగడ వ్రాసిందే.) యిది కూడా అతనికి సహ్యం కానిదే. వినిపించడం యెందుకనేవాఁడు.

యీలాటి ప్రకృతిభేదాలు వేఱువేఱు వ్యక్తులైనాక యేలాగా వుండకుండా వుండవు. అప్పటంతకాకున్నా మాటాడితే "డిఫర్మేటరీ" లకు కొంచెంగానేనా సిద్ధపడే ఆ కాలంలో అతనికి ఆ లక్ష్యం లేశమూ వున్నట్టేలేదు. ఆలాటి పదాలుకూడా ప్రయోగించి "తీసేదామురా" అంటే ఫరవాలేదని, ఆలాగే వుండనిమ్మనేవాఁడు. అక్కడికీ నేను కొన్ని తీసేసి వాణ్ని అతఁడు “సాహసుఁడు" అని నేను వ్రాయడానికి యిది వొక కారణం.

సరే పయిఘట్టానికి సంబంధించిందే యింకొకటికూడా వుదాహరిస్తాను.

చ. “కలవు రసప్రవాహము లఖండఘనాగమశృంగ గౌరవం
     బులు గల వద్భుతాధికవి పోషణ జాతమహాఫలంబులుం
     గల వని యెంచి నీ కలిమి గల్పిరి తిర్పతితోడ దాని మూ
     ర్ఖు లెఱుఁగలేక గుట్ట యనుకొందురు తిర్పతి వేంకటేశ్వరా!”

ఆయీపద్యాల అర్థం బాగా విచారిస్తే తిరుపతి శాస్త్రులుగారు ఆత్మ గౌరవం చెడకుండా, నా గౌరవం చెడకుండా ప్రత్యర్థులకు వాకట్టు కల్పించడంలో యెంత నైపుణ్యాన్ని చూపిందీ విజ్ఞులు గ్రహిస్తారుగదా! -

మాలో మేము మా మా తారతమ్యాన్ని గూర్చి వ్రాయవలసివస్తే యింతకన్న వ్రాయడం చేతకాదు, యితరులో? వ్రాస్తే వ్రాస్తారు. యీ మధ్య మా - అంటే కేవలం నాకుమాత్రమే - గురుపరంపరలోవున్న వకరు యీ విషయం యెత్తుకొని కొన్ని అక్షరాలు వ్రాశారు. యెంతో సుళువుగా మా తారతమ్యాన్ని అరంటిపం డొలిచినట్టు తేల్చి చూపి వున్నారు. ఆ అక్షరాలవల్ల యిప్పుడు లోకంలో కొందఱు అనుకొనే మాత్రమేకాక యింకా యెంతో తేడాపాడాలు మాయిద్దఱికీ పాండిత్యంలోనే కాక కవిత్వంలో కూడా వున్నట్టయితే