పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

368

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కొట్లాడుకోవలసిందే. అది నా వల్ల యెప్పటికీ తేలేదికాదు. కొన్నిట్లో నన్నెక్కువగానూ, కొన్నిట్లో అతణ్నెక్కువగానూ చెప్పుకోవడమున్నూ "అది కాదు యిది, యిది కాదు అదీ" అని పోట్లాడుకోవడమున్నూ నిన్న నేఁడు పుట్టలేదు. చాలాకాలమై పుట్టింది. రామకృష్ణకవులేమో మమ్మల్ని యిద్దఱినీ ద్వేషించినప్పటికీ అందులో నాయందే వారికి ప్రధానద్వేషం అని అందఱూ యెఱిఁగిందే. అట్టివాళ్లు “...వేంకటేశ్వరుని యాదరణమ్మునఁ జేసి కాక ఆ తిరుపతి మార్గ మిట్టిదని తెల్ప నెఱుంగ నెవండెఱింగెడిన్” అంటూ అతణ్ణి అధఃకరిస్తూ వ్రాసారు. దానికి తి. శాస్త్రికి కొంచెం కోపం వచ్చి మళ్లా ఆలాటి శ్లేషతోటే జవాబిచ్చాఁడు. అవి పలువు రెఱిఁగినవే అయినా ప్రసక్తి కలిగింది కనక వుదాహరిస్తాను.

చ. "తిరుపతిఁ బట్టి నీకుఁ గల తేజ మటంచును, నిన్నుఁ బట్టియే
    "తిరుపతి" కంచు మూర్ఖులు పదింబది తంత్రము లెన్నియేని యే
     ర్పఱచినఁగాని మీర లవి పాటియొనర్పరు బ్రహ్మచేఁతలె
     వ్వరు ప్రతిసేయఁగాఁ గలుగు వారలు తిర్పతివేంకటేశ్వరా!"

యీ పద్యంలోవున్న ‘బ్రహ్మ' పదము గురువుగారైన బ్రహ్మయ్య శాస్త్రులుగారిని కూడా చెపుతుందని తెలుసుకోవలెను. వెం. రా. లు అతణ్ణి మాత్రమే అధఃకరించి వ్రాసినా నన్ను కూడా అధఃకరించి మాట్లాడుకొనే వారు అప్పడున్నూ వున్నట్టు పద్యారంభంవల్లనే తేలుతూవుంది కనక యీ వివాదం కొత్తదికాదనిన్నీ వెం. రా. లు మాత్రమే తెచ్చిపెట్టింది కాదనిన్నీ విస్పష్టం.

ఉ. “ఏగిరియందు నీవు వసియింతువొ? లీలలుచూపుచుందువో?
     ఆగిరి పల్లెయైన జనులందుకు తిర్పతి యంచు దానితో
     యోగమె గాని యేటికి వియోగము నీకు ఘటించు? “వీడినన్
     భోగము లేదు నీ" కనుట మూర్ఖత తిర్పతివేంకటేశ్వరా!"

యిందులో ఆగిరి + పల్లె అనిన్నీ “ఆగిరిపల్లె" అనిన్నీ వ్యస్తంగానూ, సమస్తంగానూ చూచుకోవాలి. (ఆగిరిపల్లె అనేది శ్రీ నూజివీటి వారి యిష్టదైవం శోభనాద్రీశ్వరుఁడు వున్న క్షేత్రం.) అనర్గళప్రవాహంగా యీలా కవిత్వం వ్రాసే తిరుపతిశాస్త్రి సహజకవి కాఁడనిగాని, యేదో ప్రయత్నించి చెప్పే కవులలో చేర్చతగ్గవాఁడనికాని యెవరేనా అనుకున్నా ఈ పయినేనా అనుకోరని నమ్ముతాను.

అయితే యెంత యేకీభావం మాయిద్దఱికీ వున్నా లోకమే కాక మాలో మేము కూడా యెఱిఁగిన కొన్ని భేదాలు లేకపోలేదు. అతఁడు నాలాగ యేపిచ్చిపడితే ఆపిచ్చిని