పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శ్లో. విదుషాంనివహై రిహైకమత్యా
ద్యదదుష్టం నిరటంకి యచ్చ దుష్టం
మయి జల్పతి కల్పనాధినాథే
రఘునాథే మనుతాం తదన్యదైవ.

ప్రపంచంలోవున్న పండితులంతా దేన్నికాదంటే దాన్ని తాను ఔననిచెప్పి సమర్ధిస్తాననిన్నీ అవునన్న దాన్ని కాదనిచెప్పి సమర్థిస్తాననిన్నీ యీ రఘునాథపండితుని ప్రతిజ్ఞ- యితర శాస్తాలలోవున్న పండితుల కీ లాటి స్వాతంత్ర్యం కుదురదు.

ప్రస్తుతం గోపాలశాస్రుల్లగారు యితరశాస్రాలల్లో పూర్ణపండితులై కూడా యీ తర్కంలో మహాసముద్రులు. సుబ్బన్న శాస్రుల్లుగారో? తామెక్కడ పూర్వపక్షం యెత్తుకున్నారో ఆ సందర్భంకూడా యీ మహా సముద్రుండికి అంతు తెలియనీయనంత ప్రజ్ఞావిశేషం కలవారు. యీలాటి వారినిగూర్చి నావంటివాఁడు వ్రాయవలసివస్తే వట్టి పొడిపొడి మాటలు పడతాయిగాని అసలు వుపయోగించతగ్గ మాటలు పడతాయా? అయినా యేవో వ్రాసినందుకు విద్వల్లోకం క్షమించాలి.

ప్రస్తుతాన్ని రెండుమాటలు వ్రాసి యిక ముగిస్తాను. ముగించడానికేముంది? యెప్పడు సుబ్బన్నశాస్రుల్లుగారి పూర్వపక్షం అయోమయప్పంతలో వున్నట్టు తోంచిందో అప్పుడే గోపాలశాస్రుల్లుగారికి అవమానం సిద్ధమేకదా? దానితో కోపాగ్ని భగ్గున హృదయంలో వక్కసారిగా మండింది. ఆ మంట నేత్రగోళాల ద్వారా సుబ్బన్నశాస్రుల్లుగారి మీంద ప్రసరించింది. దానితో సుబ్బన్నశాస్రుల్లుగారు “అదుగో బాబూ ప్రయోగించారు దేన్నో అంటూ పడిపోయారు. వాక్కుమాత్రం లేకుండా, పది పన్నెండురోజులు జీవించి స్వర్గతులైనారు. యీ సందర్భం రాజావారు పూర్తిగా గమనించడంచేత అదిమొదలు తమ సంస్థానంలో పండితుల వివాదాన్ని పెట్టి చూడడానికి అంగీకరించకుండానే కాలక్షేపం చేసినట్లు వినికి. గోపాలశాస్రుల్లుగారిని యేమేనా గట్టిగా అనేయెడల రాజావారిక్కూడా భయమేకాCబట్టి యేకొంచెమో మందలించారేమోకాని విశేషించి కలుగజేసికొన్నట్లు వినడంలేదు. సుబ్బన్నశాస్రుల్లుగారి కుటుంబానికి తగిన యేర్పాటుచేసి ఆదరించివుంటారు కాని, దాన్ని గుణించి తపిసీలు తెలియదు. మంత్రశాస్త్రంలో అలాటిప్రజ్ఞకలవారు కూడా వుండేవారా అన్నశంక చాలామందినిబాధిస్తుంది. కాని కొంచెం వోపికపట్టి విమర్శించుకుంటే, ఆశంకనివర్తిస్తుంది. పురాణాల్లో సర్వత్రా విమానాలున్నట్లు కనపడేది గదా? అది నిజమని అనుకునేవాళ్లు అనుకున్నా కవులకల్పన అనుకునే వాళ్లేందరుండేవారు? ఇప్పడో అందరూ నమ్ముతారుగదా? ఆలాగే గోపాలశాస్రుల్లుగారివల్ల మంత్రశాస్త్రం చాలావఱకు ఆ కాలంలో