పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మఱికొన్నిన్నీ నేను బ్రహ్మయశాస్త్రుల్లుగారి శుశ్రూషాకాలంలో నేర్చుకున్నాను. అన్యోన్య సహాయంవల్ల నేను సంస్కృతంలో సాహిత్యం నేర్చుకున్నట్టయింది. తిరుపతిశాస్త్రి కూడా యిలా నేర్చుకున్నది కొంత లేకపోలేదుగాని యేమేనా నాకంటే కొంత శుశ్రూష సంస్కృతకావ్యనాటకాలకు అధికకాలంచేసి వున్నాఁడు. తుదకి “అవ్వాగుఱ్ఱమూ” వకటేఅయినప్పటికీ లోకంలో మొట్టమొదటపడ్డ అభిప్రాయం నిలిచివుంటుంది కనక పాండిత్యంలో వారికీ, వీరికీ యేమాత్రమో భేదంవుంటుందని అనుకోవడమున్నూ సయుక్తికమే. "వామనఇతి త్రివిక్రమ మభిదధతి దశావతారవిదః” కదా! వొక్క సంస్కృత వ్యాకరణమున్నూ, భారవిదాcకా కావ్యములున్నూ తప్ప నేను గురుశుశ్రూషవల్ల సంపాదించిన విద్య లేశమున్నూలేదు. తక్కినదంతా స్వయం కృషివల్లా, అన్యోన్యస్పర్ధవల్లా సంపాదించినదే అనడంలో అతిశయోక్తిలేదు. ‘లక్ష్యాలు వెదకడంలోగాని, తప్పులు వెదకడంలోగాని నీబుద్ధికి యేపుస్తకం చూచినా తప్పులే కనబడతాయిరా, నాబుద్ధికో? అన్నీ వొప్పులుగానే కనపడతా" యనేవాఁడు. అందుకే ఖండనమండనాలకర్మం అంతా నామీఁదే వుండేది. దీన్నిగురించి వ్రాయనక్కరలేదు. పలువురెఱిఁగినదే. యెవరేనా “అయ్యా! కాస్త నాగ్రంథాన్ని సంస్కరించి పెట్టవలసిం"దని మావాఁడికి పుస్తకం యిస్తే యేదో పదిరోజులు దగ్గఱ పెట్టుకొని "సర్వోత్కృష్టంగా వుం"దని యిచ్చేసేవాఁడు. తిరుపతిశాస్రులు గారు పరిష్కరించారుగదా అని గ్రంథకర్త అచ్చువేసుకోవడం జరిగేది. దానితో "తాడు తెగి తప్పేలా నూతులో పడేది". వొక మహాపండితుఁడు వొక సంస్కృతగ్రంథాన్ని రచించి ఇతణ్ణి పరిష్కరించడానికి ప్రార్థించడమున్నూ పైరీతిని మోసపోవడమున్నూ జరిగింది. అచ్చు పూర్తి అయిన పిమ్మట "లోకవెూ పాడో" అన్నట్టు వక పుస్తకం నాకు పంపించాcడాయన. ఆ సమయానికి నాదగ్గఱ మా పూర్వకాలపు సతీర్థ్యుఁడొక పండితుఁడున్నాఁడు. పుస్తకం విప్పీవిప్పడంతోటే ఆయన వక శబ్దాన్ని తప్పనడానికి మొదలుపెట్టాఁడు. నేను ఆయనతో "అయ్యా! దాన్ని రచించినవారు మహావిద్వాంసులు. తొందరపడకండి" అని వారించాను గాని ఆయన నన్నుకూడా ధిక్కరించాఁడు. పుస్తకం నాకు అందిచ్చిన పురుషుఁడు యిదంతా విని గ్రంథకర్తగారితో యేంచెప్పాఁడో, నేనేమో ఆయన పుస్తకంలో తప్పులున్నాయని అన్నట్టు తేల్చారు. మీ తి. శా, గారే దీన్ని సంస్కరించారంటూ ఆయన నన్ను అనడం మొదలెట్టారు. ఆ పుస్తకంలో మొత్తం వ్యాకరణ విరుద్ధాలు నూటికన్నా యెక్కువే వున్నాయి. ఆ విరుద్ధాలు తీసి చూపేటప్పటికి ఆయనకీ తెలిసినవే కనక ఆయన అంగీకరించారు పాపం!"తత్త్వార్టేనచ పండితమ్” కదా! తరవాత తి. శా. ని నేను కలుసుకున్నప్పుడు “యిదేం కర్మం. ఆయనపుస్తకం. ఆలా సంస్కరించా?” వంటే అన్నాఁడుకదా! యీబాడఖావుచాకిరీ యెవఁడికి పట్టింది? నీకుగాని నాకీలాటి