పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

335


సంస్కృతాంధ్రాలలో సంగీతధోరణిగా పురాణం చెప్పేశక్తీనిన్నీ అంతో యింతో కవిత్వం అల్లేశక్తీనిన్నీ వుండేవి. పయిగా నేను ఫ్రెంచి టవును యానాంవాణ్ణి, పురాణంమట్టుకు సంగీతధోరణితో కాకపోయినా చెప్పేశక్తి అతనికిన్నీ వుండేది. అతఁడు శుద్ధపల్లెటూరివాఁడు. మే మిద్దఱమూ కలవడానికి యితరవిద్యార్థులకూ తిరుపతి శాస్త్రుల్లుకీ అప్పట్లో వుండే పార్టీకలహాలు ప్రతి బంధకాలుగా కూడా వుండవలసివచ్చింది. నేను అతని యెదుటిపార్టీ విద్యార్థులకు నాయకుణ్ణిగా వుండవలసి వచ్చింది. నేను వచ్చేలోపున తిరుపతిశాస్త్రి తెల్వితేటలను చూచి వోర్వలేని విద్యార్థులు అతణ్ణి సర్వవిధాలా ద్వేషిస్తూ, యెందుకూ తమతో కలియ నిచ్చేవారుకారు. వ్యాకరణంలో అయితే ఆ విద్యార్థులు తిరుపతిశాస్త్రికంటే చాలా గ్రంథం అధికంగా అయినవాళ్లేకాని వాదం వస్తే యితఁడు చదువుకున్న భాగంలోనేకాక చదువుకోని భాగంలో కూడా ప్రతిపక్షులను బుకాయించి వోడించేవాcడు. “బూకారిగాని... ... బోలరయా మితభాషులు” అని వుందికదా! దానితో వాళ్లకు కడుపులో మంటగా వుండేది. యితనివాదం న్యాయమైనదిగా వుండడం దృశ్యాదృశ్యమే కాని యేదో అగమ్యగోచరప్పుంతగా వాదించి ఆవలివాళ్లకు వాగ్బంధం కలిగించేవాcడు. వాదంలోనే కాదు, మావాడి నడకకూడా అలాటి మార్గంగానే వుండేది. ప్రయాణాలల్లో “అతణ్ణి ముందుతోవ తీయనీయవద్దు, ముళ్లత్రోవ తీస్తాఁ" డనేవారు గురువుగారు. శాస్త్రులుగారు కూడా తగవుదిద్దితే వకపట్టాన్ని సుఖసుఖాల సమ్మతించడం వుండేదికాదు. యిదంతా మనస్సులో పెట్టుకొనియ్యేవే.

“తోడకలార్థు లే ధూర్వహుతెల్వికీ
 ర్ష్యవహించి కలహముల్ సల్పుచుంద్రు"

అని అతని నిర్యాణానంతరం ఒకసభలో చెప్పినపద్యాలలో వ్రాసి వున్నాను. నేను ప్రవేశించిన రెండు నెలలదాఁకా మా యిద్దఱికీ అంతమైత్రిగాని, అంత వివాదంగాని లేదు. ఒక మాదిరిగా కాలక్షేపం జరుగుతూవుంది. త్వరగా త్వరగా చదివి వ్యాకరణంలో అతనితో నేను కలుసుకుందామంటే అతనిపాఠం అతఁడున్నూత్వరగానే చదువుతాఁడుకదా? అందుచేత నే నెంత పెద్దపాఠం చదివినా ప్రయోజనం లేదు. కాని అతఁడెప్పుడూ చదివినపాఠాన్ని మళ్లా చూడడమంటూ వుండేదికాదు. (ఎవఁడెన్నఁడును పొత్తమెలమి విప్పకయె వ్యాకరణపాండిత్య ప్రకర్షమూనె) నేనో? చదువుకున్న పాఠాన్ని బాగా స్వాధీనపఱచుకొనేవాణ్ణి. యిూ. స్థితిలో వుండ గణపతినవరాత్రాలు వచ్చాయి. ఆ వుత్సవాన్ని చేయడానికి యాచనకంటూ బయలుదేఱి వెళ్లడం జరిగింది. అందులో శాస్త్రుల్లుగారు నన్ను నాయకుణ్ణి చేశారు. కారణం యేవో నాల్గుడబ్బులు సంపాదించడానికి అనుకూలించే