పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

313

చఁగఁ గటిసీమ మోహదరసా? దరసాదరసాధుకంఠలీ
లగళనినాద మెన్నఁ బికలాపికలాపికలా? కచాళియున్.

దీని సమన్వయము నేను చిన్నప్పుడు సంప్రదాయజ్ఞులవల్ల విన్నాను. స్వంతంగా అయితే తెలిసికోనేలేనేమో? ఇప్పటివారిలో దీనిని అన్వయించేవారెందఱుంటారో చెప్పజాలను. అవసరమని యెవరేనా కోరితే పత్రికలో ప్రకటిస్తాను. దీనిని యిలావుంచి యింతకాలంనుంచి అనేక గ్రంథాలు చూస్తూ వున్నాయే గ్రంథంలోనూ చూడని క్రొత్తమోస్తరు పద్యం వకటి మా ముత్తాతగారి కవిత్వంలో వుంది. చూడండి వుదాహరిస్తాను

మ. మదభసలాళివంటి కచమా? మృదురంభలవంటి యూరులా?
     మదనదరంబువంటి గళమా? ముకురమ్ములవంటి చెక్కులా?
     కదలని మించువంటి తళుకా? విరిబంతులవంటి గుబ్బలా?
     మదవతిజవ్వనం బమృతమాధురి సేయదె? యెంతవారికిన్.

దీనియందున్న క్రొత్తపోకడ అనుభవజ్ఞులు గమనిస్తారు. ఇట్టి చక్కని శైలిగల యిమ్మహాకవి ఏవో లేనిపోని వెఱ్ఱివెఱ్ఱి యమకాలకు లోనై దిజ్మాత్రముగాకాక వాట్లకే యెక్కువ చోటిచ్చి గ్రంథాన్ని చదివే వారికి విసుగు పుట్టించు మాదిరిగా రచించడానికి విచారించవలసి వచ్చింది. ఈయన దస్తూరీ చాలా చిన్నయక్షరాలుగా వ్రాస్తారు. అట్టి వ్రాతలో యేడెనిమిది తాటాకులు రోజువక్కంటికి స్వకవిత్వంతో నింపేవారని విన్నాను. దీనివల్ల అత్యాశుకవి యనుకోకతప్పదు. అయితే ఈయన ఆస్తితోపాటుగా అంతో యింతో కవిత్వంరీతికూడా నాకు సంక్రమించినట్లు చదువరు లనుకోకమానరు.

ఈయన ఆశుకవి యనడాని కింకొక యితిహాసం : సంస్కృత వ్యాకరణం చదువుకోవడానికి కాకరపర్తి వెళ్లినప్పుడు, గురువుగారు, “నరసన్నా! నీవు కవిత్వం చెబుతావట? ఏదీ చూదాము, ఈవృత్తంలో ఈవిషయం ఆశువుగా రచించూ” అని యేదో వృత్తం పేరుచెప్పి విషయంతో సహా ప్రశ్నించారనిన్నీ దానిమీద-

శ్లో, కమలాగృహతోరణారరాణాం
    ఘటనాపాటనయో స్సమర్థకైః
    అసురారిదృగంచలప్రసారై
    ర్ఘనమజ్ఞానతమో నిహన్యతాం మే.

అనే యీశ్లోకాన్ని రచించి గురువుగారికి వినిపించారనిన్నీ గురువు గారు అది తాము నిర్దేశించిన వృత్తంకాని హేతువుచేత, "వృత్తం మాత్రం మఱొకటయిందన్నారనిన్నీ ^