పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

307


వెళ్లకపోవడానికి కారణం, ఈయనకి కొంచెం సభాకంపం వుండేదనిన్నీ కొందఱు చెప్తారు. అయితే యిదికూడా సత్యమేయేమో. ప్రభువు మేనమామలింటికి వచ్చినప్పుడేనా చదివేటప్పుడు చాటుగా వుండి వినేటట్టేవారు సంఘటించడానికి ఇదే కారణమనిన్నీ కొందఱివల్ల విన్నాను. అయితే ప్రభువు కోరవలసిం దన్నప్పుడు ఏదో కోరనే కోరేడుకదా! హెచ్చు కోరిక కోరడానికి మాత్రం సభాకంపంబాధించి, తక్కువ కోరడానికి బాధించలేదనుకుందామా? బాగా ఆలోచిస్తే ప్రతిగ్రహదోషానికి సంశయించినట్లే నాకు తోస్తుంది. ఈయనేకాదు. ఆకాలంలోనేకాదు, నిన్న మొన్నటిదాఁకా, ఈసంశయం కలవారు పండితులలో మనదేశంలో పలువురున్నారు. వుదాహరణకి వొక్క పేరిస్తాను. బులుసు అచ్చయ్యగారు. ఇంతపండితులు "నభూతో నభవిష్యతి." వీరు నప్రతిగ్రహీతలై "ఇత్యర్థలు | పులుసూ, ఇతిభావలు కూర" అన్నరీతిని జీవితం గడిపినట్లు ప్రతివారున్నూ చెప్పుకొంటారు. ప్రకృత ముపక్రమిస్తాను. మా ముత్తాత గారు కోరిన కోరిక యావత్తు భూమికిన్నీ సంబంధించక, ఆయనవంతుకి మాత్రమే సంబంధించడంచేత, మా తాత గారికి పాండిత్యం అంతంతలో ఆగిపోయిందన్నది మనకు ప్రస్తుతం.

ఆ స్వల్ప పాండిత్యంతోపాటు స్వల్పంగా కవిత్వం కూడా మాతాతగారు అల్లేవారట కాని,యేమీ గ్రంథరూపంగా రచించినట్లులేదు. చాటువులున్నూ దొరకలేదు. “అలా రామస్వామీ! యాలా! పండితులతోటి యద్వాతద్వాల్" అనే కందపద్యభాగం మాత్రం | మాతాత చెప్పినదని మానాన్నగారు చెప్పఁగా విన్నాను. దీన్నిబట్టి తెలుగు పాండిత్యం కూడా వ్యాకరణ పాండిత్యంతో మిళితమైనది కాదని స్పష్టమే. ఏమైనా ఈమాత్రమేనా విద్యాప్రవేశం వుండడంచేతనే, పినతండ్రిగారి తాలూకు విద్యాధనం యిరువదినాలు తాటాకుల పెట్టెల పుస్తకాలున్నూ బహుజాగ్రత్తగా ఈయన భద్రపరచారు. పోయిన సూత్రాలు అప్పుడప్పుడు మరమ్మత్తు చేస్తూ, చివికిపోతూ చెదతింటూవున్న పత్రాలు క్రొత్త తాటాకులమీఁద యెత్తి వ్రాసి సంపుటాల్లో చేరుస్తూ, ప్రతి సంవత్సరమున్నూ చిత్తకార్తి యెండలో యెండబెడుతూ, ఆ యీ పుస్తకధనాన్ని మా తాతగారు భద్రపరచినందుకు, తుదకిది ఆంధ్రభాషాప్రవేశానికి వొకరివద్ద శుశ్రూష చేయకుండా కొంతవఱకు నాకు గురుత్వం చేసింది.

చిత్తకార్తి యెండలో యెండబెట్టిన సందర్భంలో ఒక పర్యాయం పిఠాపురాన్నుంచి వచ్చిన ఠాణాదారు అప్పలరాజుగారు (ఇంటిపేరు మఱపు తగిలింది) మా యింటిప్రక్కవున్న కరణాలసావిట్లో బసచేసిన కారణం చేత, ఈ పుస్తకాలు ఆయన చూచారు. చూచి ఆసక్తితో ఆయా సంపుటాలు తిరగవేస్తూ వుండంగా, ఆఱాశ్వాసాలుగా మార్చి సాపువ్రాసిన సంపుటం