పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వసతి వారు సంపాదిస్తే ముందువాళ్లు చదువుకోక చెడిపోతారని వారికి పెద్ద భయం వుండేది.) శిష్యులు చేసే ముఖ్య శుశ్రూష (ఉపచారమన్నమాట) గురువు గారి నీర్కావిబట్టలు వుతకడం, విస్తళ్లకు ఆకులుకోసి పట్టుకురావడం (అదేనా అనాధ్యాయాలలోనే) యింత మాత్రం మట్టుకే. శిష్యులు కొందరు వారాలు చేసుకొనిన్నీ మఱికొందఱు మాధుకరం చేసుకొనిన్నీ క్షున్నివకావించుకుంటూ చదువుకొనేవారు. మావారణ గురువుగారి గ్రామం (కడియె మిక్కిలి కుగ్రామం కావడంచేత శిష్యుల పోషణాన్ని గురువుగారే భరించేవారు. ఆలా భరించడంచేతనే “తిండికై యిల్లిల్లు తిరగనీయక మేయన్నదాత మాకింటనిడియె" అని వ్రాశాము. మా గురువులకు పూర్వకాలంలో మాట చెప్పలేము గాని, ఆ కాలంలో మాత్రం అన్నంకూడా విద్యాదానం చేసిన గురువులు మా పరమ గురువుగారు మాత్రమే. అయితే వీరు అగ్రహారీకులుగానీ వసద్దారులుగాని కారు. -

ఉ. ఉన్నది రెడ్డిసీమ తమకుండెడి దించుక వృత్తిదానికె
    న్నెన్నియొ యోగముల్ కుదిరెనేని ఫలించు ఫలించు దానిలోఁ
    దిన్నదిగాక తారయితు దెచ్చి యొసంగు ఫలం బదెంత హె
    చ్చున్నను వీరి కొక్క నెల యోపునొ? యోపదో? సందియమ్మగున్.

ప్రస్తుతానికి యీ పద్యం వొక్కటీ చాలును. యింకా కావలిస్తే జాతకచర్యలో చూచుకోండి. మా గురువుగారికి కుటుంబంకంటే కూడా శిష్యవర్గపోషణబాధ్యతే హెచ్చు. వీళ్ల పోషణమాత్రమే కాదు, పెళ్లి పేరంటాల విషయంలోకూడా తఱుచు వారే జోక్యం కలిగించుకొనేవారు. “పెండ్లి పేరంటముల్ ప్రియ మెలర్పఁగఁజేసి యే గుణనిధి మమ్ము బాగుచేసే” అనే సీసపద్యం పైసందర్భాన్ని వ్యాఖ్యానిస్తుంది. 'ఉదార హృదయానాంతు వసుధైవ కుటుంబకమ్" మా గురువుగారి గ్రామానికి నాతి దూరంలోనే వుంది జల్లిసీమ. ఆసీమ ధ్యానప్పంటకి పెట్టింది పేరు. ఆరోజుల్లో కాటాబస్తా వెల రు 2–0–0 లకు మించివుండేదికాదు. యుక్త కాలంలో మా గురువుగారు ఆసీమకు సంచారార్థం సవిద్యార్థికంగా బయలుదేఱేవారు. వీరు వెళ్లడమే తడవుగా ఆసీమ వాస్తవ్యులు క్షత్రియులు వారివారి శక్త్యనుసారంగా ధాన్యం పోగుచేసి పడవకి యెగుమతీకూడా స్వంతమనుష్యుల చేతనే చేయించేవారు. ఆ రాజులు మా గురువుగారెప్పుడు వస్తారా? అని ప్రతీక్షిస్తూ వుండేవారు. ఒక బస్తాకంటె తక్కువ యిచ్చిన గృహస్థును నేను యెఱుఁగను. సరే సంవత్సరానికీ సరిపడ్డప్రధాన పదార్థం గాదెలో నిలవుండేది. కూరా నారా స్వంత పెరట్లోనే పండేవి. యిఁక చెప్పేదేమిటి?... “మహాభాష్యంవా పాఠయేత్, మహారాజ్యంవాపాలయేత్" అన్నట్లు కాలక్షేపం జరిగేది. పెంకుటిళ్లు కట్టుకుందామనిగానీ వస్తువాహనాలు