పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


రాయిమాదిరిగా కూర్చుంటే యేలాగ? యేదో మాట్లాడవలసివస్తుంది. ఆ మాటలలో యేమీ దురర్ధం లేకపోయినా వుందని భ్రమించడం అక్కడనుంచి – “పంచశుభం పంచాశుభమ్" లోకి దిగడం, యెందుకీకర్మం అని వూరుకున్నా తప్పడంలేదు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, యిది "యావజ్జీవం హోష్యామిగా” పని జరగవలసిందే. మళ్లా ప్రస్తుతం దేనిలోకో పోయింది అనుకుంటాను. భవతు. బలరాముఁడికి ఆ రింగ (మైకం) తగ్గిన తరవాత పశ్చాత్తాపం కలిగింది. ఆయీ దోషం యేలా నివర్తిస్తుంది అనే చింత వుదయించింది. ఆ బ్రాహ్మఋషులను ప్రశ్నించాఁడు. వారు నిర్మొగమాటంగా జవాబిచ్చారు. యేమని?

సూతుఁడు జన్మత శ్శూద్రుఁడయినప్పటికీ జ్ఞానతః బ్రాహ్మఁడు కాఁబట్టి నీకు బ్రహ్మహత్యాదోషం తగిలింది అని స్పష్టంగా చెప్పి దానికి తగ్గ ప్రాయశ్చిత్తాదికం విధించారు. వారి వాక్యానుసారంగా బలరాముఁడు తీర్థయాత్రాదులు సేవించడం జరిగింది. మనకు ప్రస్తుతం కావలసింది “పౌరాణికులు నీచులు"కారు, పరమపూజ్యు లనేదియ్యేవే. వ్యాసులవారికి వేదాలు నాలుగేకాక శిలసంహితలున్నూ మహాపురాణాలు పద్దెనిమిదిన్నీ ఉపపురాణాదులు పద్దెనిమిదిన్నీ హృత్కవిలిగదా? ఇన్నిపురాణాలకీ కర్త వ్యాసులేనా? వేఱువేఱుగావున్నారా? అనేవిచారం యిప్పుడు పెట్టుకోవద్దు.

“పౌరాణికులు నీచులా” అను విషయాన్నే చర్చించుకుందాం. వ్యాసులవారు వేదాల ప్రచారానికి కొందఱు శిష్యులను వినియోగించారనిన్నీ పురాణ ప్రచారానికి సూతుణ్ణి నియోగించారనిన్నీ ఆ పురాణాలలోనే కనపడుతుంది. ఆ పురాణ వేత్తృత్వమే సూతుణ్ణి బ్రహ్మఋషిని చేసిందని వేఱే వ్రాయనక్కఱలేదు. అట్టి పురాణాదులయందు నీచత్వాన్ని ఎవ్వరాపాదిస్తారు? శాంతం పాపం. విధించిన బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తమే వేయినోళ్లతో ఘోషిస్తూవుంది. అట్టి పురాణాలను లోకులకు బోధించే సాహిత్య పరులు నీచులు అనడానికి యే ప్రాజ్ఞునికి నోరాడుతుంది. అసలు వేదార్థం చెప్పేవారికి

“శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా
 కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః"

అనే షడంగాలున్నూ తెలిసి వుండాలి. ఈలాటి షడంగవేత్తలు యింకా కొంచెం శేషించి వున్నది మన ఆంధ్రదేశమే. అఱవదేశంకూడా ఆయీ భాగ్యంకలదే అని వినికి. భవతు. యిన్ని ప్రజ్ఞలు వున్నా పురాణాలు, చూడకుండా వేదార్థం చెప్పడాని కేమహావిద్వాంసుఁడేనా వుపక్రమిస్తే అప్పుడు ఆవేదం పాపం గడగడ వొణికిపోతుందఁట! ఆయీరహస్యం నేను ఆమహా విద్వాంసుల ముఖతః విన్నదేకాని స్వకపోలకల్పితం కాదు. అట్టి పౌరాణికులు నీచులు అని అపవదించడానికి యెవరికి వుంటుంది సాహసం. భారత