పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/271

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

275పౌరాణికులు నీచులా?

ఈ వాక్యము గూర్చి ప్రపంచకము పుట్టింది మొదలు నేఁటివఱకు ఎవరికినీ వివరించవలసిన ప్రసక్తికలిగినట్టు వినలేదు. గ్రహచారవశాత్తూ ప్రస్తుతం నాకుకలిగింది. పౌరాణికులు నీచులే అయితే వారిలో మొట్టమొదటివాఁడైన సూతుఁడు బ్రహ్మఋషులైన శౌనకాదులచేత అర్ఘ్యపాద్యాదులిచ్చి సమ్మానించబడడం జరిగివుండదు (సూతసంహిత చూ.) అయితే బలరాముఁడు సూతుణ్ణి తల బద్దలుకొట్టి యెందుకు చంపాలి? అని ప్రశ్నిస్తారేమో? ఆచంపడం బ్రహ్మఋషులతో సమానంగా తారతమ్యం లేకుండా కూర్చున్నాఁడని కాని అతcడు పౌరాణికుఁడగుటచేత నీచుఁడని కాదు. ఆ కాలంలో బ్రాహ్మణులయితే సరి అందఱికంటే యెక్కువ అనేభావంతో క్షత్రియాదులు గౌరవించేవారు.

“కాషాయ దండమాత్రేణ యతిః పూజ్యః" అన్నట్లే జందెంవున్నంతలో బ్రాహ్మఁడు పూజ్యఁడుగా చెలామణి అయేవాఁడు. బలరాముఁడు మూఢభక్తులలోవాఁడుగాని శ్రీకృష్ణునివంటి పరిజ్ఞాత కాఁడు. పైగా హాలాపానలాలసుఁడు. ఆరింగ (మైకం) లో వున్నాఁడేమో అట్టి సమయంలో శౌనకాది బ్రాహ్మణ ఋషి సమాజంలో అగ్రపీఠాన్ని అలంకరించి కూర్చున్న సూతుణ్ణి చూచీ చూడడంతోటట్టే వొళ్లు భగ్గునమండి చేతులోవున్న ముసలంతో వొక్క పెట్టుపెట్టేటప్పటికి పాపం! ఆ తపస్వి స్వర్గం అలంకరించాఁడు. శౌనకాదులు ఆ పనికి అంగీకారం లేనివారే అయినా మాట్లాడితే మనపనికూడా పడతాఁడేమో (త్రాగుబోతుకదా) అని కిక్కురు మనకుండా వూరుకున్నారనుకోవాలి. దెబ్బకు దెయ్యం జంకుతుంది, లేదా జరిగిపోయిన పని శౌనకాదులు మందలిస్తే మాత్రం కలిసివస్తుందా? రాదుకదా; బలరామునివద్ద యీ దుర్గుణం తప్ప యితర దుర్గుణాలు లేవు. దేవ బ్రాహ్మణ భక్తుఁడు. అమాయకుఁడు. యీ సురాపాన దురుణం వొక్క బలరామునికే కాదు. యాదవులందఱికీ వున్నట్లే భాగవతంవల్ల ధ్రువపడుతుంది. ఇతఁడు వారిలో “తత్రాపిచ చతుర్థోంకః" అనుకోవాలి. భవతు. ప్రస్తుతాంశాన్ని మఱిచి వ్రాస్తున్నాననుకుంటాను. ఈ ప్రమాదం నాకు అనాదిగా వుంది. ఇప్పుడు మఱీ అధికమయి నా పని "గానుగు రోకలిసిద్ధిపిడి" అనే స్థితిలోకి వచ్చింది. ఇట్టి స్థితిలోవున్న నన్ను ఆప్తులు సభలకు ఆహ్వానిస్తారు. వెళ్లే శక్తిలేక మానుకుంటే యేలాగో లాక్కుపోతారు. అక్కడ యేప్రమాదం వస్తుందో అని వారు ఆలోచించరు. వెళ్లి వూఱికే బెల్లంకొట్టిన