పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

268

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

1) "మాతర్నాతః పరమనుచితంయత్ఖలానాంపురస్తా దాస్తాశంకం జఠరపిఠరీ పూర్తయే నర్తితాని” (లీలాశుకుఁడు)

2) “అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ" చూ

యీవిధంగా పలువురు కవులు తమ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి వున్నారు, యేమైనా సరే అంతో యింతో కవి భిక్షాటకుఁడుగా వున్నప్పుడే కొంత అందం వుంటుంది. ఆగర్భ శ్రీమత్త కవిత్వానికి సహాయపడదు.

“తిరుగంగవలె దేశదేశాల వెంబడి
 పడవలెఁ బడరాని పాటులెల్ల... ... ... ...
 కవులు కవులన్న మాత్రాన కవులుగారు
 విజయనగర మహారాజ విపులతేజ!"

★ ★ ★