పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

259

మ. “అకటా! చేరెఁడునేలకున్ దగఁడె? సప్తాంభోధివేష్టీభవ,
      త్సకలద్వీపకలాప భూపమకుటాయ త్పద్మరాగోజ్వల
      త్ర్పకటానర్గళ నిర్గళత్సుభగ శుంభత్పాదుఁడై నట్టి రా
      జకుమారుండని యేడ్చెఁ గన్నుఁగవనశ్రుల్ కాల్వలై పాఱఁగన్."

అనే పద్యానికికూడా మించినశైలితో వొకటిగాదు రెండుగాదు 60 పద్యాలు నిల్చున్న పాళాన్ని నిల్చున్నట్లుగానే ఆశువులో రచించిన శరభకవికి యెంతటి విద్వత్తువుందో యెవరునిర్ణయిస్తారు? అట్టిశరభ కవికి తగినప్రసక్తి యేదీ తటస్థంకాక యేదీ రచించినట్లు కనపడదు. లేదా, రచించినప్పటికీ, ఆ రచన కాలగర్భంలో లీనమైపోయిందో! మనకు కావలసింది ఆ యీ మాదిరి కవులు రాజులను అవసరాన్నిబట్టి యాచించినప్పటికీ భిక్షాటకులుగా పరిగణింపఁ బడరనియ్యేవే. తగిన పాత్రం దొరకని రాజులు తరించడానికి వీరే ఆధారభూతులుగా వున్నట్టు కనపడుతుంది. ధర్మాత్ములుగా వుండే మహారాజులు అయిపుట్టినవాళ్ల కాళ్లు గడగడానికి సమ్మతింపక వేదాధ్యయనపరులకూ, శాస్త్రజ్ఞులకూ, మహాకవులకూ అగ్రహారాదులు సమర్పించినట్లు కనపడుతుంది. కొన్నితరాలనుండి ప్రతిగ్రహ దోషం యెఱుఁగనివారిని - అప్రతిగ్రహీతలుగా వాడతారు. ఆలాటివారిని జమీందారులు కొందఱు మోమాటపెట్టి భూమివగైరాలు స్వీకరింపచేసిన యితిహాసా లెన్నో ఉన్నాయి. పెద్దాపురపు రాజుగారు చాలాభూములు ఆవిధంగా యిచ్చినవే. అయితే ఆరోజులలో పదిరూపాయలు యివ్వడం కంటె పదికుంచాలో, పదియెకరాలో యివ్వడమే తేలికగా వుండేదని చెప్పేమాట కూడా కొట్టేయ తగ్గదికాదు. సామాన్యులకందఱికీ అన్వయించే మాట కాదు గాని కాస్త నామరూపాలుగల కవులెవ్వరుగాని - భిక్షాటకులు కారనే చెప్పవలసివుంటుంది. అగ్రహారాలు వుండిన్నీ అవితిన్నగా ఫలించకపోవడంచేత యాచనకు గురికావలసివచ్చిన కవులు కొందఱు వున్నట్టు కనపడుతుంది.

చ. “గరిసెలవ్రాఁతె కాని యొకగంటెఁడెఱుంగను మన్నెదేశముల్
     దిరిగి సమస్త వస్తువులు దెచ్చిభుజింతును సార్వకాలమున్
     సురుచిర సత్కవిత్వనిధి సూరకవీంద్రుని కేలగల్గెఁగం
     చరయును, రేగ మేకమెడచన్నుల పోలిక రెండు గ్రామముల్"

ఆయీపద్యం తురగా రామకవిగారికి సమకాలీనుఁడు అడిదం సూరకవిగారిది. దీనిలోవున్న - కంచర – రేగ ఈరెండుపల్లెలున్నూ సూరకవి గారి సర్వదుంబాల అగ్రహారాలు. వీట్లపంటకు సంబంధించిన చెరువుకు చుట్టరికంగలవే “కదులుమిట మాని దివ్యగంగాభవాని" అనేమకుటంగల సీసాలు. ఆచెరువు నీటిముంపువల్ల తన అగ్రహారానికి