పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

251

"మహాత్మా! తాము మొన్ననేకదా దయచేసి వార్షికం పుచ్చుకొని వెళ్లి వున్నారు, మళ్లా సంవత్సరానికిఁ గాని దయచేసే ఆచారంలేదని నేను తమ రాకను నమ్మకపోవడంవల్ల తమకాగ్రహం కల్గించినందుకు క్షమించి శాపాన్ని మళ్లించవలసింది."

అని బతిమాలి వారు వచ్చిన పని అంతగాని, కొంతగాని సమంజసమైనది కాకపోయినప్పటికీ నెరవేర్చేటప్పటికి రామకవిగారికి మోమోటం కలిగి - అద్దిర! శ్రీ భూనీళలు ముద్దియలా హరికిఁ గలరు ముగురమ్మలలోఁ "బెద్దమ్మ నాట్యమాడెను.”

అని సవరించి అంతతో వూరుకోక తన మొదటి శాపం ఫోర్సు పూర్తిగా యింత మాత్రంతో శాంతించదనీ యెఱుఁగును కనక అది, “నీ నాఁడు గాదు నీ మనుమని నాఁడు అమలు జరుగు" నని చెప్పినట్టున్నూ చెప్పుకుంటారు. యీ మనుమని నాఁడు, అని వున్న పద్యం కూడా నేనుయెప్పుడో వినే వున్నాను కాని అది యిపుడు సరిగా నోటికి వచ్చిందికాదు. ఆయన వాక్శుద్ధి యెట్టిదో కాని అదేప్రకారం ఆ రాజుగారి మనుమనిరోజులు కొంతవరకు బాగా జరిగి తుట్టతుది రోజుల్లో వొక్కొక్క ముఠా చొప్పున అమ్మకానికి ఆరంభమైనట్టున్నూ ఆయన స్వర్గతి పిమ్మట భార్యలు ముగ్గురూ చాలవఱకు అనప్పిండి విస్సన్నగారి దివాన్‌గిరీ రోజులలో భర్తగారు ప్రారంభించిన విక్రయ వ్యాపారాన్ని పూర్తిచేశారనిన్నీ చెప్పకోవడం.

అనప్పిండివారు ద్రావిడ బ్రాహ్మణులు. కోనసీమ నివాసులు. ఆ యీ యింటివారిపేరు కోనసీమలో అనాతవరంలో కాఁబోలును యిప్పటికీ వున్నారని వినడం. యెవరో వొక గేస్తురాలు

“అనప్పిండి విస్సన్నగారిదీ బట్టతలే, మా వారిదీ బట్టతలే”

అందనిన్నీ లోకోక్తులలో చెప్పుకుంటారు. అదృష్టవంతులలో యీయన్ని పేర్కొనడం ఆ రోజుల్లో విశేషించి వుండేదని పైలోకోక్తివల్ల అవగతమవుతుంది.

“అనప్పిండివిస్సా ... ... తుస్సా" అంటూ వొక పెద్దదండకం భట్రా జెవరో చెప్పినట్లు వినికిడి. క్రియలో మాట రామకవిగారి వాక్కు రెండో భీమకవిగారి వాక్కే "నానృషిః కురుతేకావ్యం" అనే అభియుక్తోక్తి రామకవిగారిపట్ల సమన్వయించినట్లు యేనన్నయ తిక్కనాదులకుగాని సమన్వయించదు.

"ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు"

అనే పద్యపాదానికి సంబంధించిన యితిహాసంకూడా రామకవి మహర్షులలో పరిగణింపతగ్గవాఁడు గాని కవిమాత్రుఁడుకాఁడని చెపుతుంది. ఆయీ రాకాసుల