పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

238

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కవికానివ్వండి పదకవిత్వమంటూ చెపితే అది తేలిక పాకంలోనే వుంటుందిగాని, కఠినపాకంలో మాత్రం వుండదని నా అనుభవంమీఁద కనిపెట్టాను. మహామహోపాధ్యాయులూ షడ్దర్శనీపార దృశ్యులూ అయిన శ్రీమాన్ పరవస్తు రంగాచార్యుల అయ్యవార్లంగారు రచించిన గేయాలే యిందుకు నిదర్శనం.

“స్వాంత మనెడి చంచరీకమా! స్వామిచరణ సరసిజముల పైని వ్రాలుమా! చంచరీకమ! సరసిజముల పైనివ్రాలుమా|| రంగుగ నీవెల్లప్పుడు మంగళకరు శ్రీనివాసు, గాంగేయాంబరధారుని రంగార్యావన యనుచును. ||స్వాంత||

సంగీతానికి ముఖ్యంగా వత్తక్షరాలూ, ద్విత్వాక్షరాలూ అనుకూలించవు. వుదాహరించి చూపుతాను.

శ్లో. అభినవనవనీత స్నిగ్ధ మాపీతదుగ్ధం
    దధికణపరిదిగ్ధం ముగ్ధ మంగం మురారేః
    దిశతు భువనకృచ్ఛ్రచ్ఛేది తాపింఛగుచ్చ
    చ్చవి నవశిఖిపింఛాలాంఛితం వాంఛితం నః||

యీ శ్లోకం కృష్ణకర్ణామృత శ్లోకమే అయినా ఆయన శ్లోకాలలో నూటికి తొంభై తొమ్మిది శ్లోకాలు గానానుకూలాలే అయినా యిదిమాత్రం గానానికి విరోధిగాపడింది. యెక్కడేనా వొక అక్షరం వొత్తక్షరం పడితే చిక్కుండదుగానీ, విశేషించి పడితే చిక్కువస్తుంది. వూపిరంతా దానికే వినియోగించవలసి వస్తుంది. (వొత్తక్షరాల ద్విత్వాలే కటువుగా వుంటాయి కాని యితరద్విత్వాలు కటువుగా వుండవు. రచించే కవి యివన్నీ పరిశీలించకపోయినా గేయాలలో మృదువర్ణాలే పడతాయి) తరంగాలలో యీ నియమాన్ని అంతగా పాటించినట్లు లేదు.

“రక్ష రక్ష అసురశిక్ష రాజీవదళాయతాక్ష
 అక్షీణ కృపాకటాక్ష ఆశ్రితపక్షసంరక్ష

వగయిరాలవల్ల పయిసంగతి స్పష్టపడుతుంది. యీ క్షకారం అంత కటుకుగాదు కాని అసలు కటువు కాకపోదు. చాలా మృదుపాకంలో నడిచినవీ వున్నాయి. వుదాహరిస్తాను.

కలయే యశోదే, తవ బాలం, వ్రజబాలక ఖేలన లోలమ్||
కలయ సఖి సుందరం బాలకృష్ణం IIకలయII
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ర్పభవిష్ణుం సమస్తలోక జిష్ణుం ||కలయ సఖి||