పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవుల కష్టసుఖములు

229


“ఒక్కొకచోట నొక్కొకనియొద్ద నొకొక్కొక మాట చొప్పునన్
 జక్కఁగ సంగ్రహించితిమి ... ... ... ... ... ... ... ...
 ఇక్కడఁదాపనేల వచియించితిమున్నది యున్న రీతిగన్"

అనే పద్యం కొంచెము మా పడిన పరిశ్రమను సూచిస్తుంది. యీ పద్యం మాత్రమే కాదు-

"చదువఁగావలె శబ్దశాస్త్రాతాదికమ్మును వీక్షింపఁగావలె విద్యలెల్ల,
 ..............................................................................
 కవులు కవులన్న మాత్రాన కవులుగారు
 ....................................................................
 శ్రీమదానందగజపతి క్షితితలేంద్ర!"

అనే, పద్యం కూడా మా కవితా సామగ్రిని తెలిపేదే. శ్రవణానందంలోని-

“కవితచెప్పఁగనేర్చుఁగఱవుదీఱఁగ వేయి గంటాలకైన నిష్కంటకముగ, ... ... ... అమ్మధుసూదనుండు."

అనే పద్యం కూడా మా దృష్టిలో కవిగా నెట్టి వ్యక్తి స్ఫురిస్తాడో తెలిపేదే. ప్రసక్తాను ప్రసక్తంగా చాలా దూరం వచ్చాం. సంస్కృతంలో (సాధువు కాకపోయినా) రెండు మూడు చరణాలకు సంబంధం కల్పినది ఆధునికులది చూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను.

“అపరాధ సహస్ర సహస్రకరా,
 నపి భక్తవరాన్భవదంఫ్రిునతి
 ప్రవరా నవసీకృత మీశ్వరమాం.”

యీ శ్లోకంలో రెండవ చరణం భవదంఫ్రిునతి అనే పదంతో ముగిసింది. ఆ పదంతోటి-ప్రవరాన్ అనేపదం కలిపి సమాసం చెయ్యడం తెలుగు కవితాసంప్రదాయం. ఆయీ రహస్యం నేను పెద్దలవలన విని తెలుసుకున్నాను. మీకు తెల్పుతున్నాను. ప్రాచీనకవులలో నిట్టి రచన దొరకదు. నవీనులలో కూడ మృగ్యమే. సమాసమందు సంహిత నిత్యం. నిత్యా సమాసే' అని వుండడంచేత వివక్షాధీన మనడానికిన్నీ అవకాశం లేదు. నేను కష్టించి తెలిసికొన్న రహస్యం గదా! అని దీన్ని మీకు వ్యాఖ్యానించానుగాని యిప్పుడు-ఉభయ కవితా ప్రవీణులు లేనేలేరు. ఆంధ్రకవులు మాత్రమే వున్నారు. వారిలో కూడా పలువురు, ఛందోవ్యాకరణాది కట్టుబాట్లను ఉల్లంఘించడమందు కుతూహలం కలవారే, యితరుల దాఁకా యెందుకు నామట్టుకు నేను ఛందోవిషయంలో కొంతకున్నూ