పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవుల కష్టసుఖములు

227

అనేటప్పటికి తెలుగులో తప్ప సంస్కృతంలో విశేషించి ప్రవేశంలేని ఆయన పాపం, (వీడితో టేమిటని) వూరుకున్నారు. సభలో మట్టుకు ఆయన్ని బుకాయించినా నాకు ఆయన ఆక్షేపణ సరియైనదే యేమో అనే శంక మాత్రం బాధిస్తూనే వుండడంచేత యెక్కడేనా నా శ్లోకంమాదిరి సమాసం కల్పినవి, లేదా, సంధి కల్పినవి మహాకవి ప్రయోగాలు దొరుకుతాయేమో అని యెంతో శ్రద్ధగా గాలించడమే కాదు, కొందఱు పండితులను ప్రశ్నించాను కూడా. కాని నా సందేహం తీరనేలేదు. తుదకు అప్పటి నివాసగ్రామం యింజరానికి సుమారు కోసుదూరంలో వున్న కోలంకగ్రామకాపరస్థులు, శ్రీగోవిందవఝ్ఝుల రాజన్న శాస్త్రుల్లుగారు నా సందేహాన్ని తీర్చారు. వారుదాహరించిన కారికను (అర్ధాంత వర్ణం)లోగడ వుదాహరించే వున్నానుగదా? తెలుగులో ధారాళంగా కవిత్వం చెప్పేశక్తి సామర్థ్యాలు కలవారు, అంతకన్నా కట్టుబాట్లు చాలా తక్కువగా (యతిప్రాసాదులలో) వుండే గీర్వాణకవిత్వం చెప్పక చెప్పక ఎప్పడేనా జన్మానికల్లా శివరాత్రిగా వొక శ్లోకం రచించడం సంభవిస్తే యీ విధమైన చిక్కుకు లోనుగావలసి వస్తుంది. ఉభయభాషలలో కవిత్వం చెప్పేవారున్నూ పూర్వాపరాలు స్మార్తంచేయించే పురోహితులున్నూ వొకటే మాదిరి వారు. ఆ పురోహితులు పెండ్లిసదస్యం చేయిస్తూ వున్నారనుకోండి. అందులో సభాస్తారులనుగూర్చి

“సర్వత్ర ఇమా న్యాసనాని సుఖాసనాని.
 ఓం తథా ప్రాప్నువంతు భవంతః"
 ........................................

ఆయీ అన్యోన్య వాక్ప్రసారంలో ఆబ్దిక మంత్రపు కవులలోకి దారి తీసి అశ్లీలాన్ని ఆపాదించడం కద్దు. అందుకే యెంతటి స్మర్తలూ ఆయీ వుభయానికి యాజకత్వాన్ని వహించరు. ప్రస్తుతం మనకు ఉభయ కవీత్వ రచన, ఆయీ రచన తెలుగులో రెండుమూడు చరణాలకు సంధి కల్పడం దోషంకాదు. కనుకనే పెద్దన్నగారు కాదు నన్నయ్యగారు,

“దేవసములైన యనుజుల-తో విప్రులతో రథాళితో వచ్చి, అర
 ణ్యావాసము చేసెదు ధర-ణీవల్లభ నీవు ధర్మనిశ్చితబుద్ధిన్

యిందులో రెండవ చరణం చివరకున్నూ, మూడవచరణం ఆదికిన్నీ (అరణ్యావాసము చూ.) సంధి కల్పబడింది. ఆంధ్ర రచన కనక యిది నిర్దుష్టమే. లోగడ,

"శరదిందు. లోచనాభిరామామ్,
 అరవింద. సుందరీ ముపాసే”