పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెప్పుడేం మనమీద కోపం వస్తుందో : అలా వచ్చేయెడల యినా బంగారు ఘటిక మాదిరిగా మన తలనుకూడా యీయన మంత్రశాస్త్రబలంచేత పగులగొట్టడాని కభ్యంతరం వుండదని నిశ్చయించుకొని, వుపాయంగా సగౌరవంగా వారి మనస్సుకు నొప్పి తగలకుండానే ఈ చిక్కునుండి తప్పించుకోవాలి కనుక, ఫారాలో శాస్తులవారు దర్శనానికి వచ్చినపుడు “మా సెల వైతేనే కాని యీలోగా తాము దయచేయవలసి వుండదు. అవసరమైనప్పడు మేమే కబురుచేస్తా మన్నారు రాజావా రని చెప్పేయేర్పాటు చేశారంట. సరే! జీతం ముడుతూవుంది. ఆలా వత్సరమో, రెండు వత్సరాలో జరిగిపోయాయి. దర్శనం మాత్రమే లేదు. కాని తక్కిన మర్యాదలన్నీ యథాప్రకారంగానే జరుగుతూ వున్నాయి. అప్పటికి శాస్రుల్లగారికి యేలాగో కర్ణాకర్ణికగా తోడి పండితులు చేసిన కుతంత్రంకూడా బోధపడింది. దానితో యింక యీలాటి శత్రుమధ్యంలో యీ వింధ్యభూమిలో వుండడం యెందుకని తోంచి "ప్రభువుల ఆజ్ఞ అయితే మళ్లా కాశీకే వెడతానని మనవి చేయించుకున్నారంట. దాన్ని అంగీకరించి “తాము యొక్కడవున్నా తమకు మా సంస్థానంలో నెలనెలకూ యిచ్చే సమ్మానం పంపిస్తూనే వుంటా” మనిన్నీ “తాము చిరకాలం కాశీ నివాసం చేసే వున్నారు కాబట్టి గోదావరి తీరంలో వుండడం మాకు అభిమత మనిన్నీ కబురుచేశారంట. రాజావారి అభిమతం ప్రకారం గోపాదక్షేత్రమైన కొవ్వూరులో శాస్తుల్లుగారు నిత్య నివాసం యేర్పఱచుకున్నారు. యీ కారణంచేతనే గోపాలశాస్రుల్లుగారి యింటిపేరు కొవ్వూరు వారుగా మారింది. కాని అసలు ఇంటిపేరు ఇదికాదు. ఆపేరు నాకిప్పుడు జ్ఞాపకం వచ్చిందికాదు. వ్రాసే విషయం శ్రీ పిఠాపుర ప్రభువు నాయకమణిగా వుండేది - వ్రాంత విస్తరించి విజయనగరం మహారాజావారిమీదకిన్నీ అక్కడి పండితుల మీందకిన్నీ దొర్లుతూవుంది అనీ చదువరు లనుకుంటారేమో. ప్రస్తుత కథలో శ్రీ పిఠాపుర ప్రభువుతోపాటు యీ గోపాలశాస్రుల్లుగారుకూడా ముఖ్య నాయకులే కావడంచేత వీరిని గురించి కొంత సంగ్రహంగా వ్రాశాననుకోండి. విస్తరించే వ్రాసే యెడల యెంతేనా యీ శాస్రుల్లుగారిని గురించే కాదు - వీరిని సమ్మానించిన శ్రీ విజయనగర ప్రభువును గురించేకాదు - వ్రాయవలసే వుంటుంది. వోపిక వుంటే మటొకప్పుడు ఆ ప్రయత్నం చేసాను.

యీలాగు కారణాంతరాలవల్ల దేవిడీమన్నా అయిన్నీ వారి వంశపారంపర్యాయంగా పోషింపCబడుతూ దర్శనం మాత్రం లేకుండావున్న పండితాఖండలులు మఱికొందఱు విజయనగర సంస్థానానికి సంబంధించిన వారు వున్నారు. వారిలో శ్రీ భాగవతుల హరిశాస్రుల్లుగారు వకరు. వీరు శ్రీ కోటిపల్లెలో నిత్యనివాసంగా వుండేవారు. యిప్పడీ దేశంలో వైయాకరణులంటూ శేషం యేమాత్రమేనా వున్నట్టయితే అది యావత్తున్నూ