పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

213“నా౽నృషిఃకురుతేకావ్యం"

అంటూ వొక అభియుక్తోక్తి వుంది. యిది యే పుస్తకం లేదో తెలియదు.

శ్లో “నా౽నృషిః కురుతే కావ్యం I నా౽గంధర్వ స్పురూపధృత్
    నా౽దేవాంశో దదా త్యన్నం 1 నా౽విష్ణుః పృథివీపతిః"

అనే శ్లోకం నా చిన్నతనంలో మా ముత్తాతగారి ప్రాస్తావిక పద్య రత్నావళిలో చూచాను. యిటీవల చాలామంది పండితుల నోట విన్నానుకూడాను. ఋష్యంశసంభూతుఁడు కానివాఁడు కవి కానేరఁడనిన్నీ, గంధర్వాంశ సంభూతుఁడు కానివాఁడు అందగాcడు కానేరఁడనిన్నీ, దేవాంశ పెట్టి పుట్టనివాఁడు అన్నదాత కానేరండనిన్నీ, విష్ణ్వంశ పెట్టిపుట్టనివాఁడు రాజు (ప్రజాపాలకుడు) కానేరఁడనిన్నీ దాని తాత్పర్యం. (దీన్నిబట్టే మన భారతీయులు రాజును రెండో దేవుణ్ణిగా భావించేవారు.) ఆ యీ నాలిగింటిలో మొట్టమొదటిదాన్ని గూర్చి నాలుగుమాటలు వ్రాస్తాను. కవిగావడానికి ఋష్యంశ ఆవశ్యకమని చెప్పడంవల్ల మొదటి కవులు ఋషులే అని వేఱే చెప్పవలసివుండదు - వేదంలోకూడా కొంతభాగం ఋషిప్రోక్తం వున్నట్టు కనపడుతుందిగాని, ఆ పక్షంలో వేదాలు అనాది అనే వాదానికి భంగం వస్తుంది కనక, ఆయా భాగాలు ఆయా ఋషులు కనిపెట్టారుగాని రచించలేదని వ్యాఖ్యాతలు సమన్వయిస్తూ వచ్చారు. వేదాలు అనాదిగా వున్నాయని చెప్పేవారి వాదం స్థూలదృష్టులకు మూఢ నమ్మకంగా కనపడుతుందిగాని, తుట్టతుదకు నిల్చేది ఆ సిద్ధాంతమేకాని యితరంకాదు. వేదంలో వుండే విశేషాలు పుచ్చుకొని ఋషులు ధర్మశాస్త్రాలు, పురాణాలు రచించారు. పురాణగాథలన్నీ జరిగినవే అనుకోవడానికిన్నీ వీలు కనపడదు, జరగనివని అనుకోవడానికిన్నీవీలు కనపడదు. ఆంజనేయులు నూఱామడ సముద్రం వొక్క దాఁటుగా దూఁకాండా అంటే? (అయిదేళ్ల కృష్ణుడు గోవర్ధనం యెత్తడం వగయిరాలు చూ) మన మన శక్తులతో పోల్చి చూచుకుంటే విశ్వాస్యంగా కనపడదు. సంజీవి పర్వతం (అంతా కాదే అందాం) కొంతే అంటే? అవసరమైనంతేనా కొన్ని గంటల కాలంలో తేఁగలిగాఁడా? అంటే? యింకా యీ యిరవయ్యో శతాబ్దంలో యేదో జవాబు (రేడియోలు విమానాలు వున్నాయికదా) చెప్పడానికి పూనుకోనేనా వచ్చునుగాని, లోఁగడ వారికి ఆధారం లేదు కాని జనులయందు విశ్వాసరాహిత్య తీర్మానాలు లేకపోcబట్టి పెద్దలు