పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

సజ్జను లెంతసేపు తమ ప్రయోజనాలను వదిలికొని పరుల కార్యములు (పరోపకారార్థ మిదం శరీరం) నిర్వహిస్తూవుంటారు. (తుదకు సామెతలు సజ్జనులవంటివని తేలింది) ఆలాగే యివీని అన్నమాట. అంటే? యేమిటి? కుక్కంటే కుక్కాకాదు. జంగమంటే జంగమూకాదన్నమాట. సోదిచెప్పే యెఱకల దాని భాషలో యీలాటి వ్యాఖ్యానం వినఁబడుతుంది. వ్యాకరణ గ్రంథాలలో యింకా యీ విషయమై విపులంగా చర్చవుందిగాని, అది తీసుకువస్తే అసలు మూలాన్ని మరవవలసి వస్తుంది. అయినా చూపుతాను కొంచెం. “తేషాం పారార్ధ్యాత్" అంటూ వుంటారు వ్యాఖ్యాతలు. తేషాం - ఆసంజ్ఞా పరిభాషా శాస్త్రములకు, పారార్ధ్యాత్ - పరప్రయోజన మగుటవల్ల నుంచి అని అక్షరార్ధం - పిండి తార్థమో? -

సంజ్ఞావిధాయక శాస్త్రములకున్నూ, పరిభాషాశాస్త్రములకున్నూ, విధిశాస్త్రం కోసం పాటుపడడం అనఁగా రాజునిమిత్తం భటులు యుద్ధం చేసినట్లు యింకా యిందులో కొంత స్వార్ధంవుంటే (చావకబ్రతికి బయటcబడితే పెన్షన్ వగైరా) వుంటుందేమో! యింకో దృష్టాంతం చూపుతాను. కాశ్మీరగర్ణభాః అంటే? ఆ దేశపు గాడిదలన్నమాట. వీట్లమీఁద ఆ దేశంలో పైరయ్యే విలువగల కుంకుమపువ్వును పొలాలనుంచి యింటికిఁగాని వొక చోటునుంచి యింకోచోటికి (వర్తకం) గాని తీసుకు వెడతారు గాని వాట్లకు ఆకుంకుమ పువ్వులో లేశమున్నూ ఆహారంగా పెట్టరు. చాలాదూరం వచ్చాం యీ పరార్ధత్వాన్ని గూర్చి వ్రాస్తూను. క్రియలోమాట; సామెతలకు అర్థం యేదో యితరం వుంటుందిగాని, దానిలో మాటలకు సంబంధించి వుండదని పిండితార్థం; అయితే ప్రస్తుత సామెతలో జంగంఅంటే యెవరో గౌరవనీయమైన వ్యక్తిగా గ్రహించాలి. గౌరవనీయవ్యక్తులు ప్రపంచకంలో యెందఱోవుంటే జంగం అని బిచ్చగాణ్ణి వుటంకించడానికి హేతువెట్టిది? అని విచారణచేయవలసివస్తే, గ్రంథం చాలా పెరుగుతుంది. టూకీగా వ్రాస్తాను. ప్రతాపరుద్రాదుల ప్రభుత్వ కాలంలో శైవమతం రాజ్యంజేసిందంటే, విశ్వసించని వారుండరు. అప్పుడు జంగాలంటే సాక్షాత్తూ మహేశ్వరులే. అందుచేత ఆపదంతో గౌరవనీయులను వాడినట్లయింది. యీ సామెత ఆ రోజులలో పుట్టిందే. యిఁక కుక్కలు యెవరో నీచులు ఆపదంతో వాడబడ్డట్టయింది. ఈసామెతలో కూసుకుంటే, అనేది ఆత్మనేపదం. గ్రామంలో కొను ధాతువు బాగా వినబడడంలేదు. కాని దానిలో ఉంది. దానివల్ల అంతకు ముందు లోకంలో జంగానికివుండే పూజ్యతలో లేశమున్నూ తగ్గదని తాత్పర్యార్థం. జంగం శబ్దానికి యీ కాలంలో సామాన్యంగా అయే అర్థమే మనం చూచుకోకూడదు. ఆ కాలంలో వుండేదే చూచుకోవాలి. వ్యంగ్యార్థం విచారించ వలసివస్తే తనవెంటఁబడి మొఱుగుతూవుంటే... కుక్కలను... తనదగ్గఱ దండంవున్నా దానితో