పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

205


కావలసినవారు దానిలో చూచుకుంటారు. కనక దాన్ని గూర్చి యిక్కడ చర్చించేదిలేదు. గ్రంథకర్త యెఱిగిన్నీ ప్రయోగించినప్పుడు దానికేదో బలవత్తరమైన ఆధారం వుంటుందనుకోవలసిందే కాని వృథాగా శంకించి పని కల్పించకూడదని విజ్ఞప్తి. ప్రస్తుతం రెండుశ్లోకాలకు సంబంధించిన పుక్కిటిపురాణగాథలు వివరించఁబడ్డాయి. మరొకటి కూడా పనిలోపనిగావుదాహరించి మఱీదీన్ని ముగిస్తాను. కాదంబరి వ్రాసిన బాణమహాకవికూడా కాళిదాసుగారి రోజుల్లోనే వున్నట్టున్నూ, తానురచించిన కాదంబరిని కాళిదాసుకు వినిపించిరమ్మని వేశ్యాగృహంలోకి తనకుమారుణ్ణి పంపించినట్టున్నూ, కొడుకు వినిపించివచ్చాక "యేమన్నాఁడు కాళిదాసు?" అని కొడుకును అడిగినట్టున్నూ, అంతా విని– “యీఁగలు ముసురుతూ వున్నాయి కాదంబరికి" అన్నాఁడు కాళిదాసని చెప్పినట్టున్నూ “కాళిదాసు యీసడించిన కవిత్వం యేం కవిత్వ"మనుకొని ఆ గ్రంథాన్ని తగలఁబెట్టినట్టున్నూ తరువాత యీ సంగతి కాళిదాసు విని చాలా నొచ్చుకొని- "నేనేమో? కాదంబరీ (యీఁతకల్లు) శబ్దగతమైన శ్లేషార్ధాన్ని పురస్కరించుకొని ఆలా చమత్కరించి అన్నమాట సత్యమే. ఆమాట ప్రశంసకు సంబంధించిందే కాని యీసడింపుగా భావించడానికి కాదు. నీకావ్యం సర్వవిధాలా సర్వోత్కృష్టంగా వుంది. అట్టే చెప్పేదేమిటి?- "బాణోచ్చిష్ట మిదం జగత్‌' అని చెప్పవలసి వుంది". అని చెప్పి “సరే నేను విన్నంతమట్టుకు నేను మళ్లా యేకరుపెడతాను వ్రాసుకోవలసిం"దని అలా చేసినట్టున్నూ, వినిపించని భాగం మాత్రం కొఱఁత వుండఁగా బాణుఁడు స్వర్గానికి వేంచేసినట్టున్నూ, తరువాయి అంటే? ఉత్తరకాదంబరిని బాణుఁడి కొడుకు పూర్తిచేసినట్టున్నూ చెప్పఁగా విన్నాను. దీన్నిబట్టి బాణ కాళిదాసులు వొకటే కాలంలో వుండవలసి వస్తుంది. కాలాన్ని సహేతుకంగా పరిశీలించేవారు దీన్ని బొత్తిగా అంగీకరించరు. యీ పుక్కిటి పురాణకథను బట్టి, అంత మహాకవికి బాణుఁడికి కూడా కాళిదాసంటే, యెంతో గౌరవం వుండేదని తెలుసుకోవడమే ఫలితం. యీ గౌరవం వుండడానికి యేక కాలీనత్వంతో అవసరం వుండదు. ఆ యీ కథలన్నీ కాళిదాసుని పోలినకవి- 'న భూతోనభవిష్యతి" అని తెలుసుకోవడానికే పనికివస్తాయి. కాళిదాసు "కేకసంథాగ్రాహి అనేకాక ఆ యేకసంథాగ్రాహిత్వం ఛందోబద్ధవిషయమే కాదు; వచనంలో కూడా" అని పైకథవల్ల తేలుతుంది. యీ విషయం యితర భాషలలో కూడా సమర్థించాఁడు మన తెలుఁగువాఁడు పండిత రాయలు. పైపనినే కోర్టులో వొకానొక దావాలో సుమారు నెలరోజులు తానిచ్చిన సాక్ష్యాన్ని మళ్లా తూ-చా తప్పకుండా అనులోమంగానూ, విలోమంగానూ కూడా వొప్పఁజెప్పి “అభినవ పండితరాయ" బిరుదాన్ని పొంది వున్నారు నిన్న మొన్నటిదాఁకా సజీవులుగా వున్న శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యలవారు. బాణుఁడున్నూ భవభూతిన్నీ సభలో విద్యావిషయంలో