పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

203


స్వం ధను| ర్వర్తిం థర్తు ముపాగతే౽ంగుళియుగే బాణాగుణే యోజితాః| ఆరబ్ధే త్వయి చిత్రకర్మణి తదా తద్బాణభగ్నా సతీ! భిత్తింద్రా గవలంబ్య సింహళపతే! (సా తత్ర చిత్రాయతే) అని సమస్యాపూర్తి యథార్థ చరిత్రతోటి చేసేటప్పటికి సింహళపతిగారు లేచి కూర్చున్నారు, వ్యాధి కుదిరిందన్నారు, కాళిదాసుగారిని కౌగిలించుకున్నారు. యెంత గౌరవం జరగాలో అంతా జరిగింది. చాటుగా వుండి రాణీగారు సర్వమూ చూస్తూవున్నారు. “ఔరా! బక్క బ్రాహ్మఁడెంత మహానుభావుఁడూ?" అని అత్యాశ్చర్యపడుతూ వున్నారు. కోటకోటంతా ఆనందమయం అయిపోయింది. భోజరాజుగారు బిక్క మొగంతో వెలవెలపోతూ చూస్తూ వున్నారు. అప్పుడు యీయన రాజఱికాన్ని చూచేదెవరు? కాళిదాసుగారు- "యేమి రాజా! ఐశ్వర్యానికా అగ్రస్థానం? లేక కవిత్వానికా!" అన్నాఁడు. భోజరాజుగారు ముమ్మాటికీ కవిత్వానికే అని వొప్పుకున్నారు. రాణీగారు "వోహో వీరిద్దఱూ లోకంలో సర్వేసర్వత్రా చెప్పుకునే భోజకాళిదాసులు కాఁబోలు! వీరి వివాదంవల్ల మనకు యీలాటి లాభం కలిగింది. కవుల వివాదాలు కూడా లోకోపకారకాలు అవుతాయనడంయీలాటిదే అనుకుని సంతోషించారు. కథ కంచికి వెళ్లింది. మనం యింటికి వచ్చాం. కాని యీ శ్లోకానికి తాత్పర్యం కొంచెం వ్రాసి మఱీ వ్యాసాన్ని ముగిస్తాను. అసల కథేమిటంటే? సింహళ దేశాధీశ్వరుఁడు యేదో పనిమీంద యెక్కడికో వెళ్లాఁడు. అక్కడ వొక పట్నంలో వక సుందరి యీయన్ని చూచి మోహించింది. వెంటనే యీయన విగ్రహాన్ని చిత్రించడాని కాలోచించింది. మన్మథుఁడు ధనుస్సుకు నారి తగిల్చాఁడు. వ్రాసే కుంచె రెండు వేళ్లతోటీ పట్టుకుంటూ వుంది. పాపం! అంతట్లో మన్మథుఁడు పూవు బాణాలను నారితో చేర్చాఁడు. ఆ సుందరి చిత్రరచన కారంభించింది. ఆరంభించీ ఆరంభించడంలోనే బాణపాతం జరిగింది. దానితో తన సమీపమందు వున్న గోడను ఆనుకొని - ఆ సుందరియ్యేవే వక చిత్తరువుగా మాఱిపోయింది. తుట్టతుదనివున్న మాటకు చిత్తరువుగా మాఱిపోయిందనేమాటే అర్థం. అయితే ఆయీ సంగతి జ్ఞాపకం తెచ్చినంతట్లో రాజుగారికి వ్యాధికుదరడ మేమిటంటారేమో? వినండీ. ఆ కన్యకామణికి శృంగారరసావేశం వచ్చి చిత్రాకృతి యేలా ప్రాప్తించిందో యీ రాజుగారిక్కూడా తన్మయత్వంలోగతం అంతా మఱుపు తగిలింది. కాళిదాసుగారివల్ల మళ్లా ఆయాసంగతులు జ్ఞప్తికి వచ్చాయి. దానితో జ్ఞానోదయం కలిగింది. గనక యీ పైన కర్తవ్యాన్ని గూర్చి ఆలోచించుకోవడానికి కావలసినంత అవకాశం వుంటుందన్నమాట. అన్యోన్యమున్నూ ప్రేమ కలిగే వున్నారన్న అంశం తేలిందికదా? యీ పైన వీరిద్దఱున్నూ దాంపత్యధర్మమును పొందినట్లు తెలిస్తేనైతే బాగుండేది కాని ఆ విషయం నాకు చెప్పినవారు చెప్పలేదు. అందుచేత నాకున్నూ తెలియదు. యీ శ్లోకానికి సంబంధించిన కథకూడా యెవరిచేతో కల్పించబడిన బాపతే అని నేననుకుంటాను. శ్లోకంలో