పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

197

 విన్నానో జ్ఞప్తి చాలదు. అసలుమాత్రం యథార్థం కాకపోలేదు. అలాగే విద్యాభ్యాస కాలంలో మ్యునిసిపల్ దీపాల సహాయం యీయనకుపకారం చేసినట్టున్నూ వినడం. యీదీపాల సహాయం శ్రీ భాష్యం అయ్యంగారు వగైరా కొన్ని మహావ్యక్తులకున్నూ జరిగినట్లు వినడం కలదు. అట్టి నాగేశ్వరరావుగారు యేరోజు కారోజు చేసే దానం యెంత వుంటుందో? లెక్కవేస్తే తేలదు. ఆయీ విషయం నేను కొంత కళ్లారా చూచిందే. యీయన ఆగర్భ శ్రీమంతుఁడై వుండి చిన్నప్పటినుంచీ యిలాటి దాతగానే వుంటే లోకానికి కలిగే ఆదరాతిశయం వేఱు, యిప్పుడు కలిగే ఆదరాతిశయం వేఱు. మన కాళిదాసుగారు మొట్టమొదట భోజరాజ దర్శనానికి వెళ్లేటప్పుడు కవిత్వంలో నిరుపమానుఁడే అయినప్పటికీ తగినంత పేరుప్రతిష్ఠలు కలవాఁడుగా లేనట్టున్నూ, రాజదర్శనానంతరం పెద్దయోగం పట్టినట్టున్నూ చెప్పకోవడంలోనే విశేషం వుందని వేరే వ్రాయనక్కఱలేదు. దండి భవభూతులు ఏకసంథా, ద్విసంథా గ్రాహులనిన్నీ కాళిదాసుగారు భోజరాజుగారి మీఁద చెప్పిన శ్లోకాలు వెంటనే వారు చదివి యివి మేమిదివఱలో చెప్పినవే కాని నూతనాలు కావని చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి వారి ధారణకి లొంగని మాదిరి శ్లోకాలు, శ్లో. 'వాశ్చారేడ్డ్వజధ గ్ధృతోడ్వధిపతిః కుద్రేడ్జజానిః" అనే పాషాణపాక శ్లోకాలు రచించి వారికి శృంగభంగం చేసి కాళిదాసు భోజుని ఆస్థానంలో స్థిరపడిపోయాఁడనిన్నీ వకకథ చెప్పుకోవడం వుంది. యింకా భోజుఁడికిన్నీ కాళిదాసుకిన్నీ సంబంధించిన వెన్నో కథలున్నాయి. భోజరాజుగారి వుంపుడుకత్తె కాళిదాసుగారికి వలపుసానిగా యేర్పడ్డట్టున్నూ తుదకు ధనాశచేత ఆవేశ్య కాళిదాసు మెడకోసి చంపినట్టున్నూ వకకథ వుంది.

శ్లో. "కుసుమే కుసుమోత్పత్తి శ్శ్రూయతే నతుదృశ్యతే" అని భోజరాజుగారు వేశ్యా కేళీగృహపు గోడమీఁద వ్రాసి దీన్ని పూర్తిచేసిన వారికి అర్ధరాజ్యం యిస్తామని వ్రాసినట్టున్నూ ఆ అర్ధరాజ్యం తాను పుచ్చుకునే వుద్దేశ్యంతో ఆశ్లోక పూర్తిని కాళిదాసుచేత- "బాలే! తవముఖాం భోజే దృష్ట మిందీవరద్వయమ్" అని చేయించి కాళిదాసు నిద్రపోతూ వుండఁగా "మర్డరు" చేసి మిడిమిడిజ్ఞానపాండిత్యం కల ఆ వేశ్య "బాలే” అన్న పదం తీసివేసి, “రాజే” అని చేర్చి రాజుగారిని అర్ధరాజ్యం యివ్వవలసిందని కోరఁబోతూ వుండగా, ఆపూర్తియందువున్న మోసాన్ని “రాజే” అనే అసంగత మార్పువల్లనే గ్రహించిన మహాకవి భోజరాజు- “కాళిదాసుని చంపేశావా యేమిటి? నీతల్లి కడుపుకాలా!” అని ప్రశ్నించాఁడనిన్నీ, అది యథార్థం వప్పుకోక విధిలేక వప్పుకొని శవాన్ని చూపిస్తే అప్పుడు భోజరాజు తనకు కూడా మృత్యువు సమీపించడాన్ని తెలిసికొని యేకొంచెమో శేషించివున్న తన ఆయుర్దాయాన్ని విభజించి సగం కాళిదాసుకుయిచ్చి యిద్దఱున్నూ కలిసి శ్రీవాల్మీకిరచిత రామాయణగాథననుసరించి రామాయణ చంపూరచన కారంభించి సుందరకాండవఱకున్ను