పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుక్కిటి పురాణ కథలు

193


శ్లో. “కిమపి కిమపి మందం”

అనే శ్లోకంలో నాలుగో చరణాంతం- "రాత్రిరేవం వ్యరంసీత్" అనేచోటమాత్రం వకమాట అన్నాఁడని చెప్పఁగా ఆమాట యేమాటో చెప్పవలసిందని భవభూతి తన కొడుకు నడిగినట్టున్నూ కొడుకు యీలా చెప్పినట్టున్నూ పండితపరంపరలో చెప్పుకుంటారు. దాన్ని వుదాహరిస్తాను- -

"నాన్నా! కాళిదాసుగారు నాటకాన్ని వినిపించేటప్పుడు ఆయన సాని సున్నం రాసి యిసూవున్న తమలపాకులు వేసుకుంటూవున్నారు. ఆ సందర్భంలోపైని వుదహరించిన-“కిమపి కిమపి మందం” అనే శ్లోకచతుర్థచరణం వింటూ సానితో “సున్నం, ఎక్కువయింది" అని మాత్రం అన్నారు. యింతకన్న వక్కమాటకూడా నాటకం వినిపించేటప్పుడు కాళిదాసుగారు మాట్లాడినట్టే లేదు" అని కొడుకు చెప్పేటప్పుడు "రాత్రి రేవం వ్యరంసీత్" అనేచోట "ఏవం వ్యరంసీత్" అనడంకంటె “ఏవ వ్యరంసీత్" అంటే యెక్కువ సరసంగా వుంటుందని కాళిదాసుగా రభిప్రాయపడ్డట్టు భవభూతి తెలుసుకొని ఆలాగు సవరించు కొన్నట్టు వినికి. యీ పాఠంలో వున్న స్వారస్యమేమిటంటే? స్నిద్ధ దంపతులైన సీతారాములు యేవో తలా తోఁకా లేనిరీతిగా మాటలాడుకుంటూ పరస్పరాలింగన మహోత్సవాన్ని అనుభవిస్తూ వుండఁగా, రాత్రి య్యేవే విరామాన్ని పొందిందిగాని వారిగోష్ఠి యింకా విరామాన్ని పొందనేలేదు- అనేది- అసలు పాఠంలో సున్నవుంటే, “ఏవం” అని వుంటుంది. కనక ఏవం అంటే? ఈ ప్రకారంగా సీతారాములకు రాత్రి గడిచిపోయింది అని మాత్రమే వస్తుంది, ఆ పాఠంకంటే యీపాఠం సొగసుగా వుంటుందని కాళిదాసుగారు “సున్నం" యెక్కువయిందనే మిషతో సూచించినట్టయింది కాని యీ కథ యిటీవల వారికల్పన కాని మఱోమాదిరిదికాదు. యేమంటే, కాళిదాసు తెలుఁగు దేశస్థుఁడు కాడు కాఁబట్టి తెలుఁగుపదమైన “సున్నం” అనే పదంతో ఆలా చమత్కరించడం సంభవించదుకదా! కాఁబట్టి యెవరో బుద్ధిమంతులు ఆశ్లోకంలో ఆసవరణను వుపపాదించి యీకథాకల్పనచేసి కాళిదాసుకు అంటగట్టినమాట సత్యదూరంకాదు. యీలాటివే యింకా కొన్ని కథాకల్పనలున్నాయి. వక నాఁడు దండిమహాకవిన్నీ కాళిదాసుగారున్నూ ధారాపట్టణ వీథమ్మట షికారు వెడుతూవున్నారనిన్నీ ఆలా వెళ్లేటప్పుడు దండిగారివద్ద తమల పాకులున్నూ చెక్కలు వగయిరాలున్నూ వున్నాయనిన్నీ సున్నం లేకపోవడంచేత ఆ వీథిలోవున్న ఒకానొక వేశ్యాగృహం గుమ్మంలో వున్నవక వేశ్యబాలికను వుద్దేశించి-శ్లో"తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే!" అని దండి శ్లోకపూర్వకంగా ఆజ్ఞాపించినట్టున్నూ కాళిదాసు గారివద్ద తమలపాకులుకూడా లేకపోవడంచేత-శ్లో"పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంతా౽౽కీర్ణ లోచనే!"