పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

191


ఆయన తెలిపినారే కాని లేశమున్నూ అనుచిత ప్రసంగానికి ఆయన చోటివ్వలేదు. ఆయన యిప్పటి ఆచారాలకు ప్రాధాన్యం యిచ్చేవారు. నేనో? పూర్వుల ఆచారాలు ఆచరించినా ఆచరించకపోయినా వాట్లయందే ఆదరం కలవాణ్ణి. అందుచేత ఆయనకూ నాకూ మతభేదం వుండవలసి వచ్చింది. యీవిడ నన్ను స్వార్థపరుఁడని సూచించింది. బాగా ఆలోచిస్తే దేవస్వాపహారానికి సమ్మతించని నన్ను దూషించడంవల్ల ఆదోషం ఆవ్యక్తియందే వుందేమో? ప్రాజ్ఞులు విచారించకపోరు.

★ ★ ★