పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

189


వ్రాసిన మాటలకు మళ్లా యింత వ్రాయవలసివచ్చింది. ఆ మాటలవల్ల వారిసంఘం ముందుకురాక వెనక్కి మళ్లా మళ్లుతుందేమో అని వక సంఘసంస్కర్తిృకి అనుమానం కలిగింది. కాని ఆ అనుమానం సరి అయిందికాదు. యింతమాత్రం చేత అది వెనకడుగు వేయదు. కాని భగవంతునికికూడా శక్యంకాని సంస్కారాలు కొందఱు యిప్పుడు ఆరంభిస్తూ వున్నారు. అవి శక్యమైనవే అయితే భగవంతుడిదివఱకే చేసివుండేవాఁడేమో? యిన్ని విధాలుగా సృష్టివుండేదే కాదేమో? కొందఱు బలవంతులు, కొందఱు బలహీనులు, ధనవంతులు, ధనహీనులు, సౌందర్యవంతులు, సౌందర్యహీనులు, నీతిమంతులు, నీతిశూన్యలు యీలాటి భేదం లేకపోయేదేమో? అని బుద్ధిమంతులు చర్చించి, చర్చించి తేలక తుట్టతుదకు విసిగి ఆలోపం భగవంతుండిమీఁద పెడితే మఱీ చిక్కు వస్తుందని భయపడి వాఁడివాఁడికర్మాను సారంగా ఆయీ భేదాలు కలిగినట్టు స్థిరపఱచుకున్నారు. ఆ కర్మలు వొక మోస్తరుగా వుండవు. కనక చాలాభాగం వారికి సంతుష్టి కలిగింది. అట్టిస్థితిలో అందఱినీ వక్క తాటిమీఁదకు తేవడము యేలాగ? యెక్కడో సామ్యవాదం బయలుదేఱిందంటారు. అక్కడ కూడా కొన్ని విషయాలలోనే కాని అన్నివిషయాలలోనూ ఆ సిద్ధాంతం అమల్లోకి వచ్చినట్టుగాని, రావడానికి వీలున్నట్టుగాని, కనపడదు. యేమేనా ఇప్పటివారి సిద్ధాంతాలు యేటికెదురీఁదే తోవలో వుంటాయి. నామట్టుకు దేవదాసీల సంస్కరణం కూడా అలాటిదే. వ్యక్తిగతంగా మంచికి రావడానికి యిదివరకే ఆధారం వుందని పలుచోట్ల వ్రాసే వున్నాను. సర్వే సర్వత్ర వక తాటిమీఁదికి రావడం శక్యం యెన్నటికీ కాదు- కాకపోయినా యత్నించేవారు యత్నించడం మానకూడదు. యత్నించవలసిందే. విద్యలు పోతాయని భయం వారికి అవసరంలేదు. వాట్లవల్ల లాభం వుంటే, ఆ లాభం అవసరమే అయితే అందులోకి యెవరో మరివకరు ప్రవేశించి తీరుతారు. దొడ్డి వూడ్చడం దగ్గరనుంచి ఖాళీలేకుండా నడిపిస్తూవున్న భగవంతుఁడు యీకళల నిమిత్తం యేదోవక జాతిని యేర్పరచలేకపోతాఁడా? యేదేనా వృత్తి వకటి ఖాళీ కావడమే తడవుగాని అయేట్టటయితే అందులో వుండే దోషాన్ని గణించకుండా ప్రవేశించేవాళ్లు యీ కాలంలో లేకపోతారనుకో నక్కఱలేదు అధవా! లేకపోతారే అనుకోండి. "అత్తా! అత్తా! నీకొడుకు ఆఁకలికి ఆఁగలేఁడుసుమా!” అన్న సామెతగా అందుకోసమని ఆవృత్తిని వదిలిపెట్టి వెళ్లే వారు ఆఁగుతారా? అందుచేత వారివారికి తోఁచినట్లు హేయమనితోఁచిన వారివారి వృత్తులను వదులుకోవలసిందే. పరమోత్తమస్థానాన్ని అలంకరించవలసిందే. అట్టి స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి వుంటే గవర్నమెంటుచట్టాలకు వుండాలి కాని యే యితరపండితుల వ్యాసాలకూ వుండదు - యెవరికి తోఁచింది వారు వ్రాస్తూవుంటారు – “ఉపసంహరించుకో వలసింది” అని వ్రాయడం పొరపాటు. వితంతూద్వాహాన్ని